ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, బీ అలర్ట్ - ప్రభుత్వం కీలక ఆదేశాలు..!!

మురుసు తుఫాను తీర ప్రాంత జిల్లాల పై విరుచుకు పడుతోంది. పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం అప్రమత్తం అయింది. తుఫాను తీరం దాటుతున్న వేళ ఈ రాత్రి వరకు కొన్ని ప్రాంతాల్లో రేపు (బుధవారం) సైతం భారీ వర్షాల నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో, అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ప్రజలకు కీలక సూచనలు అందిస్తోంది. అందరూ అలర్ట్ గా ఉండాలని సూచిస్తోంది.

తుఫాను తీవ్రత ఎక్కువగా ఉంది. భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని తీర ప్రాంతంలో మురసు తీవ్ర తుఫాన్ తీరం దాటే ప్రక్రియ కొనసాగుతోందని ప్రభుత్వం వెల్లడించింది. క్రమంగా తుఫాన్ తీవ్రత తగ్గే అవకాశం ఉందని తెలిపింది. తుఫాన్ ప్రభావంతో ఈ రోజు (మంగళవారం).. బాపట్ల, గుంటూరు, కృష్ణా, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. నవంబర్ 3వ తేదీ (ఈ రోజు) మధ్య ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక నవంబర్ 4వ తేదీన మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిస్తాయని తెలిపింది.

 ముగిసిన టీటీడీ ఛైర్మన్ పదవీ కాలం- పాలనా బాధ్యతలు వారికి కేటాయింపు, ఉత్తర్వులు..!!
ముగిసిన టీటీడీ ఛైర్మన్ పదవీ కాలం- పాలనా బాధ్యతలు వారికి కేటాయింపు, ఉత్తర్వులు..!!
apsdma-issues-heavy-rain-alert-as-severe-cyclone-murusu-crosses-coast-here-the-report

ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం

కాగా, మురసు తుఫాన్ ప్రభావంతో బాపట్ల జిల్లాలో అత్యధికంగా 56.95 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. ఈ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక, పునరావాస చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. తాజా నివేదిక ప్రకారం 10,805 మంది నిరాశ్రయులు పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారని పేర్కొంది. మురసు తుఫాన్ ప్రభావంతో.. ప్రాథమిక అంచనాల ప్రకారం 30,661 హెక్టార్ల వరి, 21,474 హెక్టార్ల పత్తి, 605 హెక్టార్ల మొక్కజొన్న పంటలకు నష్టం జరిగే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం వివరించింది. ఇక తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు విద్యుత్ శాఖ ప్రత్యేక బృందాల ఏర్పాటు చేసిందని పేర్కొంది. సాగునీటి చెరువులు, రిజర్వాయర్లు, దిగువ ప్రాంతాల్లో వరద పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+