ఏపీలోని ఈ జిల్లాల్లో రాగల మూడు గంటల్లో..

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురుగాలులు, పిడుగులతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. నైరుతి రుతుపవనాలు నిరాశపరిచినప్పటికీ ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఒకింత వర్షాలకు లోటు ఉండట్లేదు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు పలు జిల్లాల్లో తరచూ వర్షాలు పడుతున్నాయి.

ఇవే పరిస్థితులు ఈ సాయంత్రం కూడా కొనసాగనున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం మేఘవృతమై ఉంటుందని, చల్లటి వాతావరణంతో పాటు అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిస్తాయని పేర్కొంది.

APSDMA Predicts Lightning and moderate rainfall for several areas in Andhra Pradesh for the next 3 hours

కోస్తాంధ్రలోని కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడొచ్చు. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడటానికి అవకాశం ఉంది. అలాగే బాపట్ల, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.

పులివెందులలో ఆ పార్టీకి కనీసం 15,000 మెజారిటీ: బెట్టింగ్ రాయుళ్ల భారీ అంచనాలు
పులివెందులలో ఆ పార్టీకి కనీసం 15,000 మెజారిటీ: బెట్టింగ్ రాయుళ్ల భారీ అంచనాలు

రాగల మూడు గంటల్లో.. ఏపీలోని పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది.. విపత్తు నిర్వహణ సంస్థ. వివిధ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ సైతం ఇచ్చింది. ఇందులో కోస్తా దక్షిణ ప్రాంతం, రాయలసీమ జిల్లాలు ఉన్నాయి. నెల్లూరు, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ అయింది. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, సత్యసాయి, తిరుపతి జిల్లాలు ఎల్లో అలెర్ట్ పరిధిలో ఉన్నాయి. ఆయా జిల్లాలకు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చు.

అలా చేస్తేనే జనం నమ్ముతారు.. : ఎస్ఈసీతో జగన్ ఆకస్మిక భేటీ
అలా చేస్తేనే జనం నమ్ముతారు.. : ఎస్ఈసీతో జగన్ ఆకస్మిక భేటీ

ఈదురుగాలులు వీస్తున్నప్పుడు గానీ, పిడుగులు పడుతున్నప్పుడు గానీ శిథిల నివాసాలు, గోడలు, చెట్లు, హోర్డింగుల కింద తలదాచుకోవద్దని ఎస్డీఎంఏ పేర్కొంది. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేసే రైతులు, రైతు కూలీలు, శ్రామికులు, పశుకాపరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రఖర జైన్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+