సైలెంట్ గా వచ్చిన చిన్న సినిమా.. బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్.. టికెట్ ముక్క దొరకట్లేదు..!
ఇటీవలి కాలంలో చిన్న సినిమాలదే హవా కొనసాగుతోంది. భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల్ని అలరించడంలో విఫలం అవుతుండగా చిన్న సినిమాలు సైలెంగా వచ్చి సూపర్ హిట్ అవుతున్నాయి. అయితే పండగ సీజన్ లో చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటాయి. ఈ సారి దసరా పండక్కి సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2, టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ రణబాలి సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అలాగే అనుపమ పరమేశ్వరన్ క్రేజీ కళ్యాణం, చివరగా ఆనంది 'గరివిడి లక్ష్మి' సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే జైలర్ 2, రణబాలి చిత్రాలు పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుండగా ఆ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా 'గరివిడి లక్ష్మి' మూవీ ఊహించని కలెక్షన్స్ ను రాబడుతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ మూవీకి టికెట్ ముక్క దొరకడం లేదు. థియేటర్లు హౌజ్ ఫుల్ అవుతున్నాయి.
ఉత్తరాంధ్ర బుర్రకథ జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రానికి గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మించారు. అలాగే గరివిడి లక్ష్మి చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందించారు. ఇక ఈ బయోపిక్ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 17 న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీలో గరివిడి లక్ష్మి పాత్రలో యంగ్ హీరోయిన్ ఆనంది అద్భుతమైన నటనతో అదరగొట్టింది. అలాగే ఈ సినిమాలో రాగ్ మయూర్, నరేశ్, రాశి, ఎల్ బీ శ్రీరామ్, అవసరాల శ్రీనివాస్, అంకిత్ కొయ్య అలాగే షకలక శంకర్, శరణ్య ప్రదీప్, కంచరపాలెం కిషోర్, నితిన్ ప్రసన్న, వైరా రాఘవ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఇక గరివిడి లక్ష్మి బాక్సాఫీస్ కలెక్షన్స్ వివరాలకు వస్తే.. తొలిరోజు ఈ మూవీ దేశవ్యాప్తంగా 602 షోలు పూర్తి చేసుకుని 29 శాతం అక్యూపెన్సీని నమోదు చేసింది. తొలిరోజు ఈ మూవీ ఇండియా వైడ్ గా రూ. 60 లక్షల వరకు కలెక్ట్ చేసినట్లు సాక్ నిల్క్ సంస్థ వెల్లడించింది. అలాగే రెండోరోజు ఇప్పటివరకూ 308 షోలను పూర్తి చేసుకుని 31 శాతం అక్యూపెన్సీని నమోదు చేసింది. రెండోరోజు ఇప్పటివరకూ రూ. 31 లక్షల వరకు కలెక్ట్ చేసింది. రెండు రోజుల కలెక్షన్స్ రూ. కోటి దాటినట్లు సాక్ నిల్క్ సంస్థ స్పష్టం చేసింది. పాజిటివ్ మౌత్ టాక్ తో గరివిడి లక్ష్మి మూవీకి రానున్న రోజుల్లో మరిన్ని కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతోంది.












Click it and Unblock the Notifications
