అలా చేస్తేనే జనం నమ్ముతారు.. : ఎస్ఈసీతో జగన్ ఆకస్మిక భేటీ

స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై జరుగుతున్న దాడులు, వారిని నామినేషన్లు వేయకుండా టీడీపీ నాయకులు అడ్డుకుంటోండటం, పత్రాలను లాక్కెళ్లడం.. వంటి పరిణామాలను ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ ఉదయం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన కొద్దిసేపటి కిందటే విజయవాడలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాతో సమావేశం అయ్యారు.

రాష్ట్రంలో రాబోయే ఎన్నికల ప్రక్రియను అత్యంత నిష్పాక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాలని జగన్ విజ్ఞప్తి చేశారు. నామినేషన్ల స్వీకరణ ఘట్టం నుంచే అభ్యర్థులు, ఓటర్లకు పూర్తిస్థాయి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పూర్తిగా ఎన్నికల యంత్రాంగంపైనే ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడమే పెద్ద సవాల్ గా మారిందని ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.

YS Jagan Urges APSEC Paramilitary Deployment and Live CCTV Footage to Ensure Free local body Polling

ఎస్ఈసీతో సమావేశం అనంతరం జగన్ విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్ష అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తూ నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం అప్రజాస్వామిక చర్య అని విమర్శించారు. నామినేషన్ ప్రక్రియలోనే ఇన్ని అడ్డంకులు ఎదురవుతుంటే, పోలింగ్ రోజున సాధారణ ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవడం సాధ్యపడదని ఆందోళన వ్యక్తం చేశారు. పోటీ చేయాలనుకునే ప్రతి అభ్యర్థికి ఎలాంటి ఆటంకాలు లేకుండా నామినేషన్ ఫారం సమర్పించే వాతావరణాన్ని.. కమిషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.

పులివెందులలో ఆ పార్టీకి కనీసం 15,000 మెజారిటీ: బెట్టింగ్ రాయుళ్ల భారీ అంచనాలు
పులివెందులలో ఆ పార్టీకి కనీసం 15,000 మెజారిటీ: బెట్టింగ్ రాయుళ్ల భారీ అంచనాలు

స్వేచ్ఛాయుత పోలింగ్ సాధ్యపడాలంటే స్థానిక పోలీసు యంత్రాంగంపై ఆధారపడకుండా, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పారామిలిటరీ దళాల పర్యవేక్షణలోనే ఎన్నికలు నిర్వహించాలని జగన్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దీనిపై కేంద్రంతో మాట్లాడి తగిన ఒత్తిడి తీసుకురావాలని ఎస్‌ఈసీని కోరినట్లు చెప్పారు. పారామిలిటరీ బలగాల మోహరింపు అవసరాన్ని వివరిస్తూ ఈ సాయంత్రమే గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించనున్నట్లు వెల్లడించారు.

మిథున్ రెడ్డి, వైసీపీ మాజీ ఎంపీ, మరో 70 మందిపై ఎఫ్ఐఆర్
మిథున్ రెడ్డి, వైసీపీ మాజీ ఎంపీ, మరో 70 మందిపై ఎఫ్ఐఆర్

ఎన్నికల నిర్వహణలో కమిషన్ తన నిష్పాక్షిక వైఖరిని కాపాడుకోవాల్సిన అవసరం జగన్ తేల్చి చెప్పారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించుకోవాలని సూచించినట్లు జగన్ పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల లోపల, బయట జరుగుతున్న ప్రతి పరిణామాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా లైవ్ సీసీటీవీ ప్రసారాలను అందుబాటులోకి తేవాలని చెప్పారు.

ఈ లైవ్ వెబ్‌కాస్టింగ్ దృశ్యాలను రాష్ట్రంలోని ప్రతి పౌరుడికీ సులువుగా వీక్షించేలా అందుబాటులో ఉంచితేనే ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వసనీయత పెరుగుతుందని ప్రతిపాదించారు. ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రతా లోపాలు తలెత్తకుండా నిఘా పెట్టాలని అన్నారు. అక్కడ సీసీటీవీ కెమెరాల ద్వారా లైవ్ వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయాలని, బ్యాలెట్ బాక్సులు ఉన్న ప్రదేశాలను ప్రజలందరూ చూసే వెసులుబాటు కల్పిస్తేనే ఫలితాల పారదర్శకతపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు ఉండవని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+