ఏబీ వెంకటేశ్వరరావు వెనుక చంద్రబాబు? సాయిరెడ్డికి కేశినేని కౌంటర్..!

విజయవాడ మేయర్ అభ్యర్ధిగా మాజీ ఐపీఎస్, ఒకప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు పోటీకి దిగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా టీడీపీ కూటమి పార్టీ జనసేన తరఫున కాపు అభ్యర్ది వంగవీటి రాధా, వైఎస్సార్సీపీ తరఫున బీసీ అభ్యర్ది రాయన భాగ్యలక్ష్మి పోటీ చేస్తున్న వేళ.. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఏబీ వెంకటేశ్వరరావు కాంగ్రెస్, కమ్యూనిస్టుల మద్దతుతో స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగడం వెనుక చంద్రబాబు ఉన్నారన్న చర్చ జరుగుతోంది. ఇదే విషయాన్ని వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ ట్వీట్ చేశారు. దీనిపై టీడీపీ స్పందించింది.

ఏబీ ఎంట్రీతో మారిపోయిన బెజవాడ మేయర్ లెక్కలు-ఆ ఇద్దరికీ కష్టాలేనా?
ఏబీ ఎంట్రీతో మారిపోయిన బెజవాడ మేయర్ లెక్కలు-ఆ ఇద్దరికీ కష్టాలేనా?

ఏబీ వెంకటేశ్వరరావు వెనుక చంద్రబాబు, టీడీపీ ఉన్నారన్న సాయిరెడ్డి వ్యాఖ్యలపై విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని (Kesineni Chinni) ఫైర్ అయ్యారు. విజయసాయిరెడ్డి తప్పుడు ఆరోపణలు, అసత్య ప్రచారాలతో ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. విజయవాడ మేయర్ అభ్యర్థిగా ఏబీ వెంకటేశ్వరరావు పోటీ వెనుక టీడీపీ ఉందంటూ విజయసాయిరెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రిటైర్డ్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వ్యక్తిగత హోదాలో పోటీ చేస్తుంటే టీడీపీకి ఆపాదించడం కుట్రపూరిత చర్యే అన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలతో కూటమి పార్టీల ఐక్యతను దెబ్బతీయలేరని కేశినేని చిన్ని తెలిపారు.

Kesineni Chinni Counters Vijayasai Reddy s Claims on TDP Support for AB Venkateswara Rao s Mayor Bid
ఏబీ పోటీ వెనుక చంద్రబాబు ? జగన్ ఇండీ పాలిటిక్స్- సాయిరెడ్డి షాకింగ్ ట్వీట్..!
ఏబీ పోటీ వెనుక చంద్రబాబు ? జగన్ ఇండీ పాలిటిక్స్- సాయిరెడ్డి షాకింగ్ ట్వీట్..!

2014-19 మధ్య బీజేపీ నుంచి టీడీపీని దూరం చేసేందుకు కుట్రలు చేశానని విజయసాయిరెడ్డి స్వయంగా చెప్పుకున్నారని కేశినేని చిన్ని గుర్తుచేశారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా కూటమిని విడగొట్టలేరన్నారు. తమ ఐక్యతను చెడగొట్టలేరన్నారు. ఏ1 మాటలు నమ్మడానికి, ఏ2 మాటలు వినడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరని ఈ వ్యవహారంలోకి జగన్ ను సైతం లాగారు. విజయసాయిరెడ్డి ఎంత బురద జల్లినా కూటమి కలిసే ఉంటుందని కేశినేని తేల్చిచెప్పారు. కూటమి పార్టీలన్నీ కలిసి విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు. అన్ని చోట్లా కూటమి విజయంతో విజయసాయిరెడ్డి వంటి వారి తప్పుడు ప్రచారాలకు అడ్డుకట్ట వేస్తామని ఎంపీ కేశినేని చిన్ని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+