హింసను అడ్డుకోలేని ఎస్ఈసీ..! చంద్రబాబు వీరవిధేయుడు- పునేఠాపై జగన్ ఫైర్..!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు రాజ్యాంగం కనబడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపే ధైర్యం చంద్రబాబు లేదన్నారు. అందుకే నామినేషన్లు వేసేందుకు వస్తున్న అభ్యర్థుల్ని భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య బద్ధంగా నామినేషన్ వేస్తామన్నా తీసుకోవడం లేదన్నారు.
ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా నాడు చంద్రబాబు హయాంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన విషయాన్ని జగన్ గుర్తుచేశారు. సీఎస్‌గా అనిల్ చంద్ర పునేఠా విధులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని, విధుల నుంచి తొలగించిందని జగన్ తెలిపారు. అలాంటి అనిల్ చంద్ర పునేఠా పదవీ విరమణ చేసినా చంద్రబాబు ఆయన్ను ఇప్పుడు ఎస్ఈసీగా తీసుకొచ్చారని విమర్శించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా అనిల్ చంద్ర పునేఠా విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఆయన చంద్రబాబుకు వీరవిధేయుడని, చంద్రబాబు ఏం చెబితే పునేఠా అది చేస్తున్నారని ఆరోపించారు. అందుకు రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో జరుగుతున్న దారుణాలే సాక్షమన్నారు.

పుంగనూరులో వైఎస్సార్సీపీ ఎంపీ మిధున్‌రెడ్డిపై, ఇతర నాయకులకు మారణాయుధాలపై దాడులు చేశారని జగన్ ఆరోపించారు. వైఎస్సార్సీపీ నేతలపై,వాహనాలపై దాడులకు తెగబడ్డారన్నారు. ట్విస్ట్ చేసేందుకు మద్యం వాహనాలు ఉంచుతున్నారని జగన్ పేర్కొన్నారు. కార్లను ధ్వంసం చేశారని, నామినేషన్లు వేయకుండా చేస్తున్నారని విమర్శించారు. ఆర్వోలు నామినేషన్లు తీసుకోవడం లేదన్నారు. ఎంపీ మిథున్‌రెడ్డి వాహనాల్లో మద్యం బాటిళ్లు పెట్టారని, పార్లమెంట్ సభ్యుడు,లోక్‌సభ ఫ్లోర్ లీడర్ మిధున్‌రెడ్డి ఉన్నా సరే నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల, రాయచోటి, దర్శిలో చోటు చేసుకున్న ఘటనల్నీ జగన్ ప్రస్తావిస్తూ ఈసీ వైఫల్యాన్ని ఎండగట్టారు.













Click it and Unblock the Notifications
