ఏబీ పోటీ వెనుక చంద్రబాబు ? జగన్ ఇండీ పాలిటిక్స్- సాయిరెడ్డి షాకింగ్ ట్వీట్..!

ఏపీలో జరుగుతున్న స్దానిక సంస్దల ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా విజయవాడ కార్పోరేషన్ కు జరుగుతున్న ఎన్నికల్లో మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సడన్ ఎంట్రీ ఇచ్చారు. కూటమి తరఫున జనసేన అభ్యర్ధి వంగవీటి రాధ, వైఎస్సార్సీపీ తరపున రాయన భాగ్యలక్ష్మిని మేయర్ అభ్యర్ధులుగా ఆయా పార్టీలు ప్రకటించిన తర్వాత వ్యూహాత్మకంగా స్వతంత్ర అభ్యర్ధిగా ఏబీ వెంకటేశ్వరరావు రంగంలోకి దిగడం, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ఆయనకు మద్దతు ప్రకటించడం జరిగిపోయాయి. దీంతో ఈ పరిణామం వెనుక ఏముందున్న చర్చ జరుగుతోంది. దీనిపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు.

ఏబీ ఎంట్రీతో మారిపోయిన బెజవాడ మేయర్ లెక్కలు-ఆ ఇద్దరికీ కష్టాలేనా?
ఏబీ ఎంట్రీతో మారిపోయిన బెజవాడ మేయర్ లెక్కలు-ఆ ఇద్దరికీ కష్టాలేనా?

ఏబీ వెంకటేశ్వరరావు విజయవాడ మేయర్ అభ్యర్ధిగా తెరపైకి రావడం వెనుక ఏం జరిగిందో వివరిస్తూ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) ఇవాళ ఓ ట్వీట్ చేశారు. ఇందులో టీడీపీ, జనసేన, వైఎస్సార్సీపీ, కమ్యూనిస్టులు, ఇండియా కూటమి ఇలా అందరినీ టార్గెట్ చేశారు. కాక్రోచ్‌పార్టీ"తో కాంగ్రెస్‌ కలిసి పని చేస్తోందని, కాంగ్రెస్‌ పెట్టిన 'ఇండి' కూటమిలోనే సీపీఐ, సీపీఎం భాగస్వాములని, ఆ కాక్రోచ్‌కు వైయస్సార్‌సీపీ బేషరతుగా మద్దతు పలికిందని, వైయస్సార్‌సీపీతో కలిసి పని చేస్తున్నాం అని "సీపీఐ" ప్రకటించిందని, జీవితంలో జగన్‌ను సీఎం కాకుండా చూడటమే తన లక్ష్యం-'జగన్‌ నెవర్‌ ఎగైన్‌' అన్నది "ఏబీ వెంకటేశ్వర్రావు" శపథం అని సాయిరెడ్డి సీక్వెన్స్ వివరించారు.

Vijayasai Reddy Questions Chandrababu s Role in AB Venkateswara Rao s Mayor Bid Amid YS Jagan s INDIA Bloc Politics
Vijayasai Reddy Questions Chandrababu s Role in AB Venkateswara Rao s Mayor Bid Amid YS Jagan s INDIA Bloc Politics
జగన్ కేసుల్లో మరో కీలక పరిణామం- ఈడీకి చంద్రబాబు అనుమతి..!
జగన్ కేసుల్లో మరో కీలక పరిణామం- ఈడీకి చంద్రబాబు అనుమతి..!

అలాగే "రెడ్డి" పారిశ్రామిక వేత్తలే రెండేళ్ళుగా ఏబీవీ టార్గెట్‌ అని గుర్తుచేశారు. కాపు అయిన రంగా తనయుడు "వంగవీటి రాధా" ను జనసేనకు పంపేసి, కమ్మ అయిన ఏబీవీని ఇండిపెండెంట్‌గా పోటీ చేయించటం చంద్రబాబు మార్కు దుర్మార్గపు రాజకీయమంటూ చురకలు అంటించారు. ఆ ఏబీవీకి సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌ మద్దతు పలికాయన్నారు.ఇంత సిగ్గు లేని రాజకీయాలను ఏపీ ప్రజలు ఇంకెంత కాలం భరించాలి అంటూ విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ట్వీట్ చదివిన వారెవరికైనా ఏబీ వెంకటేశ్వరావు పోటీ వెనుక ఇంత జరిగిందా అని అనిపించక మానదు. మరోవైపు కొత్త పార్టీ పెడుతున్న వేళ ఇప్పటికే ఉన్న కూటమి, వైఎస్సార్సీపీని టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి ఈ ట్వీట్ చేయడం ఎవరికీ ఆశ్చర్యం అనిపించడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+