ట్యాంక్ బండ్ వెళ్తున్నారా..? మీ కోసమే బిగ్ అప్డేట్..
అక్టోబర్ 18 ఆదివారం సద్దుల బతుకమ్మ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. అమరవీరుల స్మారక స్థూపం నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ పై ఉన్న బతుకమ్మ ఘాట్ వరకు వేడుకలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉందన్నారు. పరిస్థితులకు అనుగుణంగా పలు మార్గాల్లో వాహనాల రాకపోకలను నిలిపివేయడం అలాగే దారి మళ్లించడం జరుగుతుందని స్పష్టం చేశారు. మేరకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచనలు చేశారు.
నగరంలోని ట్రాఫిక్ సమాచారం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఫేస్ బుక్ పేజీ @HYDTP అలాగే సామాజిక మాధ్యమం అయిన ఎక్స్ ఖాతాను ఫాలో కావాలని సూచించారు. అత్యవసర సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్ లైన్ 9010203626ను సంప్రదించవచ్చని తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డీ జోయల్ డేవిస్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇక సద్దుల బతుకమ్మ పండగ వేడుకలకు వచ్చే ప్రజలు స్నో వరల్డ్, ఎన్టీఆర్ స్టేడియం, అమరవీరుల స్మారక స్థూపం, ఎన్టీఆర్ ఘాట్ పార్కింగ్, ఎన్టీఆర్ గార్డెన్స్ పార్కింగ్, హెచ్ ఎండీఏ గ్రౌండ్, లుంబినీ పార్క్ ఫ్రంట్ సైడ్, బీఆర్ కే భవన్ రోడ్డులో కేటాయించిన స్థలాల్లో వాహనాలను పార్క్ చేయాలని ట్రాఫిక్ పోలీసులు ఆదేశించారు. బతుకమ్మ వేడుకలు ముగిసిన తర్వాత ట్రాఫిక్ ఆంక్షలను ఎత్తివేసి సాధారణ రాకపోకలను అనుమతిస్తామని స్పష్టం చేశారు.

ఇక ప్రధాన జంక్షన్ల వద్ద ట్రాఫిక్ మళ్లింపులు ఓ సారి చూస్తే.. ఇక్బాల్ మినార్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను తెలుగు తల్లి ఫ్లైఓవర్, కట్టమైసమ్మ, డీబీఆర్ మిల్స్, ఇందిరా పార్క్, గాంధీనగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వైపు మళ్లిస్తున్నారు. అలాగే ఖైరతాబాద్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను నెక్లెస్ రోటరీ వద్ద ప్రసాద్స్ ఐమాక్స్, మింట్ కాంపౌండ్ లైన్ లోకి మళ్లిస్తున్నారు. అటు నల్లగుట్ట, లిబర్టీ, సికింద్రాబాద్, ముషీరాబాద్, కవాడిగూడ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకూ ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేశామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications
