బంగాళాఖాతంలో బలపడ్డ ఆవర్తనం- ఏపీలో వర్షాలు
Bay of Bengal: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి మరింత బలపడింది. దీని ప్రభావంతో ఏపీలో ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్ర ఉత్తర కోస్తా జిల్లాల్లో ఇప్పటికే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. ఇదే పరిస్థితి ఇంకో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశాలు లేకపోలేదు.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో బుధవారం చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షం కురిసింది. కాకినాడ జిల్లాలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కుండపోతగా వర్షం పడింది. వచ్చే 48 గంటల పాటు ఇదే తరహా పరిస్థితి ఉండొచ్చు. ఉత్తరాంధ్ర, ఏజెన్సీ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురవడానికి అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.

కొన్ని చోట్ల పిడుగుల పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఏపీలో వర్షాలపై బులెటిన్ విడుదల చేసిందా సంస్థ. శుక్రవారం వరకు ఎక్కడెక్కడ వర్షాలు పడొచ్చనే విషయంపై తన అంచనాలను వెల్లడించింది. అదే సమయంలో- దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రత పెరిగినట్లు తెలిపింది.
బంగాళాఖాతం నైరుతి- పశ్చిమ మధ్య ప్రాంతంలో ఇటీవలే ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడింది. అదే ప్రాంతంలో అల్పపీడనంగా మారింది. ఇది మరింత బలపడి అక్కడే కొనసాగుతోందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. ఇది వచ్చే 24 గంటల్లో ఉత్తర వాయువ్య దిశగా, క్రమంగా ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతుందని అన్నారు.
అనంతరం వచ్చే 24 గంటల్లో బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో క్రమంగా బలహీనపడుతుందని వివరించారు. దీని ప్రభావంతో నేడు, రేపు అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని రోణంకి కూర్మనాథ్ చెప్పారు. శుక్రవారం నాడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని అన్నారు.
మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పిడుగులు పడే సమయంలో ప్రజలు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని విజ్ఞప్తి చేశారు.
మంగళవారం నాడు రాయలసీమ జిల్లాల్లో ఎండ తీవ్రత పెరిగింది. నంద్యాల జిల్లా దొర్నిపాడు, కడప జిల్లా మద్దూరులో 41.5 డిగ్రీలు చొప్పున ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలు జిల్లా కామవరం 40.7, పల్నాడు జిల్లా రావిపాడులో 40.6, ప్రకాశం జిల్లా దరిమడుగలో 40.6 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు రికార్డయింది. రాష్ట్రవ్యాప్తంగా 25 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఎండ తీవ్రత కనిపించింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం, ఏలూరు జిల్లా పోలవరం, వేలేరుపాడు మండలాల్లో నేడు తీవ్ర వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు రోణంకి కూర్మనాథ్ తెలిపారు. 25 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు కావొచ్చని అంచనావేశారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications