ఆర్ణబ్ తుఫాన్.. కాకినాడ- గోపాల్ పూర్ మధ్య తీరం దాటే ఛాన్స్ : కంట్రోల్ రూమ్ ఏర్పాటు

తూర్పు- మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. ఈ సాయంత్రానికి వాయుగుండంగా మారనుంది. అనంతరం తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. బుధవారం ఉదయానికి కోస్తాంధ్ర తీరానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. దీంతో అధికార యంత్రాంగం ముందస్తు చర్యలను చేపట్టింది. తీరప్రాంత జిల్లాల ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఈ అల్పపీడనం శనివారం రాత్రికి తూర్పు- మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా తీవ్రరూపం దాల్చనుంది. ఆదివారం ఉదయానికి ఇది తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెంది మరింత బలపడనుంది. సోమవారం నాటికి పశ్చిమ- మధ్య బంగాళాఖాతంలో ఇది పూర్తిస్థాయి తుపానుగా మారే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అంచనావేసింది. అనంతరం ఇది వాయవ్య దిశగా కదులుతూ బుధవారం ఉదయానికి ఏపీ తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నాయి. కాకినాడ- గోపాల్ పూర్ మధ్య తీరం దాటొచ్చని ఐఎండీ అంచనావేసింది.

APSDMA provides cyclone emergency assistance control room and information through toll-free hotlines

తుఫాన్ నేపథ్యంలో తీరప్రాంత జిల్లాల యంత్రాంగాన్ని ఇప్పటికే పూర్తిగా అప్రమత్తం చేశారు.. విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు. సముద్రం తీవ్ర అలజడిగా మారనున్నందున వేటకు వెళ్లిన మత్స్యకారులు తక్షణమే సురక్షితంగా తీరానికి తిరిగి రావాలని సూచించారు. భారీ వర్షాలను ఎప్పటికప్పుడు సమీక్షించడానికి రాష్ట్రస్థాయిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అత్యవసర సహాయం, తాజా వాతావరణ సమాచారం తెలుసుకోవడానికి ప్రజలు ఉపయోగించుకోవడానికి ఉచిత నంబర్లను కేటాయించారు.

వైఎస్ అంజలిరెడ్డి వెడ్డింగ్ కార్డ్: వెన్యూ విషయంలో నో కాంప్రమైజ్
వైఎస్ అంజలిరెడ్డి వెడ్డింగ్ కార్డ్: వెన్యూ విషయంలో నో కాంప్రమైజ్

ప్రమాదకర పరిస్థితులు తలెత్తితే ప్రజలు తక్షణ సహాయం కోసం 112, 1070 లేదా టోల్ ఫ్రీ నంబర్ 18004250101 కి ఫోన్ చేసి సహాయక బృందాలను సంప్రదించవచ్చని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. తుఫాన్ తీరం దాటే సమయంలో అతి భారీ వర్షాలతో పాటు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని, అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని కోరారు. చెట్లు, హోర్డింగులు, శిథిల భవనాల వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ తలదాచుకోవద్దని సూచించారు.

బ్యాంకింగ్ లో నూతన అధ్యాయం: రేపు ఆర్బీఐ డేటా సెంటర్, సైబర్ సెక్యూరిటీ ప్రారంభం
బ్యాంకింగ్ లో నూతన అధ్యాయం: రేపు ఆర్బీఐ డేటా సెంటర్, సైబర్ సెక్యూరిటీ ప్రారంభం

తుఫాన్ నేపథ్యంలో అటు ఒడిశా ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. పూరీ, గంజాం, గజపతి, రాయగఢ, కోరాపుట్, మల్కాన్‌గిరి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ వార్నింగ్ జారీ చేసింది. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా తుఫాను ప్రభావిత జిల్లాల్లో ప్రభుత్వ అధికారుల సెలవులను రద్దు చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలను సిద్ధంగా ఉంచారు. తీర గ్రామాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల నివాసితులు అప్రమత్తంగా ఉండాలని కోరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+