ఉచిత బస్సు ప్రయాణం..ప్రత్యేక బస్సులు, APSRTC కీలక ప్రకటన..!!

APSRTC కొత్త రికార్డ్‌ సృష్టించింది. గత ఏడాది ఆగస్టు నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ పథకం నిర్వహణ ను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కొత్తగా వస్తున్న ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ ఈ పథకం కొనసాగించేలా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. పథకం కింద జీరో టికెట్ మొత్తాన్ని ప్రభుత్వం రీయంబర్స్ చేస్తోంది. ఇదే సమయం తో ప్రత్యేక బస్సులు సంక్రాంతి సమయంలో ఆర్టీసీ పెద్ద ఎత్తున నడిపింది. కాగా, ఆర్టీసీ కొత్త రికార్డ్ వేళ సిబ్బందిని ఎండీ ప్రశంసించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్‌ఆర్టీసీ) ఆదాయంలో రికార్డ్‌ సృష్టించింది. ఆర్టీసీ సంక్రాంతి వేళ పెద్ద సంఖ్యలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని డిమాండ్ ఉన్న ప్రాంతాలతో పాటుగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకు ప్రత్యేక బస్సులను నడిపింది. ప్రయాణీ కుల డిమాండ్ కు అనుగుణంగా బస్సు సర్వీసులను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచింది. అదే సమయంలో ఉచిత బస్సు ప్రయాణం పైనా ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంది. సంక్రాంతి నుంచి తిరుగు ప్రయాణంలో భాగంగా జనవరి 19న ఒక్క రోజులోనే రూ.27.68 కోట్ల ఆదాయం సాధించింది. ఆర్టీసీ చరిత్రలోనే అత్యధిక రోజువారీ ఆదాయ రికార్డ్‌ను నెలకొల్పింది. జనవరి 19న ఆర్టీసీ బస్సుల్లో అత్యధికంగా 50.6 లక్షల మంది ప్రయాణించారు. అయితే,ఉచిత బస్సు ప్రయాణం స్త్రీశక్తి పథకం నిర్వహణ కొనసాగిస్తూనే ఆర్టీసీ ఈ రికార్డు నెలకొల్పింది. కాగా, ఈ పండుగ సమయంలో ఉచిత ప్రయాణం వినియోగించుకొని అనేక మంది ప్రముఖ దేవాలయాలను సందర్శించారు.

apsrtc-new-record-in-revenue-and-occupancy-ratio-during-sankranti-time

సంక్రాంతి సెలవుల ముందు ఏర్పాటు చేసిన బస్సుల్లోనూ పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు తమ గమ్య స్థానాలకు చేరుకున్నారు. సంక్రాంతి సెలవులు ముగియడంతో ప్రజలంతా సొంతూళ్ల నుంచి తిరుగు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేకంగా అదనపు బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వందలాది ప్రత్యేక బస్సులు నడిపి, ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చింది. ఈ అసాధారణ విజయానికి కారణమైన డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ సిబ్బంది, సూపర్ వైజర్లు, అధికారులను ఏపీఎస్‌ఆర్టీసీ వైస్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమల రావు ప్రత్యేకంగా అభినందించారు. కాగా.. త్వరలో ఆర్టీసీలో డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెట్టేందుకు అధికారులు నిర్ణయించారు. అదే విధంగా ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ప్రభుత్వం సైతం ఎప్పటికప్పుడు నిధులను రీయంబర్స్ చేయటం కూడా ఆర్టీసీకి ఆదాయం పెంపుకు దోహదపడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+