ఏపీలో మే 21 నుంచి ఆర్టీసీ సర్వీసులు- ఆన్ లైన్ టికెట్లకు అనుమతి... తిరిగే ప్రాంతాలివే..
ఏపీలో బస్సు సర్వీసుల పునరుద్దరణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏపీలో ఆర్టీసీతో పాటు ప్రైవేటు బస్సులను కూడా నడపనున్నారు. ఏపీలో నడిచే ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్ బస్సులకు కూడా ఒకే రకమైన నిబందనలు వర్తింపజేయనున్నారు. మే 21 నుంచి ఆర్టీసీ సర్వీసులు పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఏపీలో నేటి నుంచి ఆర్టీసీ బస్సులు..
కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా రెండు నెలల క్రితం నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులను ఏపీలో ఇవాళ పునరుద్ధరించనున్నారు. ఇవాళ రాత్రికి దూర ప్రాంతాలకు వెళ్లే కొన్ని సర్వీసులను ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. బస్సుల పునరుద్దరణపై సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న 24 గంటల్లోనే రాకపోకలు ప్రారంభిస్తామని నిన్న రవాణామంత్రి పేర్నినాని ప్రకటించిన నేపథ్యంలో మే 21 నుంచి ఆర్టీసీ సర్వీసులు పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఎక్కడి నుంచి ఎక్కడికి...
ఇక బస్సులు ఎక్కడి నుంచి ఎక్కడికి నడపాలనే విషయంలోనూ ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు. దీని ప్రకారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల మధ్య సర్వీసులను తొలుత పునరుద్ధరించనున్నారు. విజయవాడ, విశాఖ, తిరుపతితో పాటు ప్రధాన నగరాలను కలిపే సర్వీసులకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అలాగే ప్రతీ జిల్లా కేంద్రాన్ని మరో జిల్లా కేంద్రంతో కలిపేలా సర్వీసుల పునరుద్ధరణ ఉండబోతోంది. ప్రస్తుతం దాదాపుగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కరోనా కేసులు ఉన్నాయి. అయితే అవి పూర్తిగా రెడ్ జోన్లలో లేవు. దీంతో జిల్లా కేంద్రాల మధ్య బస్సు సర్వీసుల పునరుద్ధరణకు అవకాశాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
Recommended Video

త్వరలో స్పెషల్ బస్సులు...
కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో చిక్కుకుపోయిన ఆంధ్రా వాసులను స్వస్ధలాలకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసినా అది సాధ్యం కాలేదు. దీంతో మరోసారి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి పరిమిత సర్వీసులను, కరోనా మార్గదర్శకాలు పాటిస్తూ నడిపేలా ప్లాన్ చేస్తున్నారు. ఇవి కేవలం ఆయా నగరాల్లో చిక్కుకున్న వారిని వెనక్కి తీసుకొచ్చేందుకు మాత్రమే నిర్వహిస్తారు. అనంతరం వీటిని నిలిపివేస్తారు. ఆయా రాష్ట్రాల్లో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేశాక మాత్రమే ఈ సర్వీసులను పునరిద్ధరిస్తామని అధికారులు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications