ఉద్యోగాల జాతర, APPSC నోటిఫికేషన్ - గ్రూప్-1లో కొత్త సర్వీసులు..!!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ భర్తీలో భాగంగా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీకి తుది కసరత్తు చేస్తోంది. ఇందుకు ముహూర్తం ఖరారైంది. ఇదే సమయంలో గ్రూప్-1 పోస్టులు 149 నుంచి 167కు పెరగనున్నాయి. పోస్టులను ఫిక్స్ చేసారు. ముందుగా ప్రాధమిక నోటిఫికేషన్ జారీ చేసి.. అందులో భర్తీ... దరఖాస్తుల పై పూర్తి సమాచారం విడుదల చేయనుంది. అక్టోబర్ తొలి వారిలో పూర్తి స్థాయి నోటిఫికేషన్ జారీ కానుంది.
ఏపీలో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ తుది కసరత్తు చేస్తోంది. జాబ్ క్యాలెండర్‌లోని పోస్టులకు సెప్టెంబర్ 15న ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇందులో ఖాళీలు, పోస్టుల కేటాయింపు, దరఖాస్తుల తేదీలు, పరీక్షల షెడ్యూల్ వెల్లడిస్తారు. అక్టోబర్ మొదటి వారంలో పూర్తి నోటిఫికేషన్ రానుంది. పలు కేటగిరీల్లో దాదాపు 10 వేల పోస్టులు ఉన్నాయి. నోటిఫికేషన్ లో సిలబస్, రిజర్వేషన్ రోస్టర్ వంటి వివరాలను వెల్లడించనుంది. జూలై 1కి ఉన్న వయసును పరిగణలోకి తీసుకోనున్నారు. కొత్తగా చదువు పూర్తి చేసిన వారు ఒన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవటం.. అదనపు అర్హతలు సాధించిన వారు అప్డేట్ చేసుకోవచ్చు. కాగా.. ఏపీపీఎస్సీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం గ్రూప్ వన్ సర్వీసులో మరిన్ని సర్వీసులు చేర్చుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు.

పెద్ద ఎత్తున పోస్టుల భర్తీ దిశగా కసరత్తు
తాజా నిర్ణయం మేరకు డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (ఎపీ పంచాయితీ రాజ్, గ్రామీణాభి వృద్ది), జిల్లా అగ్నిమాపక అధికారి (ఎపీ ఫైర్ సర్వీసెస్) అసిస్టెంట్ డైరక్టర్, ప్రాజెక్టు అధికారి(ఎపీ అడల్ట్ ఎడ్యుకేషన్ సర్వీసెస్), డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు (కమ్యూనికేషన్స్) (ఏపీ పోలీసు సర్వీస్), జిల్లా విద్యాశాఖాధికారి (ఏపీ ఎడ్యుకేషన్ సర్వీసు)ల పోస్టులను గ్రూప్ వన్ సర్వీసులో చేర్చారు. ఈ మార్పులతో గ్రూప్ వన్ సర్వీసు పోస్టుల సంఖ్య 22కి చేరింది. అలాగే మండల ప్రజాపరిషత్ డెవలప్‌మెంట్ అధికారి (ఏపీ పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి) పోస్టును గ్రూప్ వన్ సర్వీస్ జాబితా నుంచి తొలగించారు. ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ సర్వీస్ రిక్రూట్‌మెంట్‌లో ఈ క్లాసిఫీకేషన్ వర్తిస్తుందని జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా.. డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీ పోస్టులను మల్టీ జోన్ పోస్టులుగా మార్చగా.. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణం గా ఆయా విభాగాలు పోస్టు కేడర్ లను మార్పు చేసాయి.













Click it and Unblock the Notifications
