Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ నుంచి కుంభమేళాకు ఏపీటీడీసీ ప్రత్యేక బస్సులు - రూట్, ప్యాకేజీ..!!

Mahakumbh Mela 2025: మహా కుంభమేళాలో భక్తులు పోటెత్తుతున్నారు. దేశ విదేశాల నుంచి వస్తున్న భక్తులతో ప్రయాగ్ రాజ్ నిండిపోయింది. తెలుగు రాష్ట్రాల నుంచి కుంభమేళా కు వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ప్రత్యేక రైళ్లు ఫుల్ అయ్యాయి. ఆర్టీసీ సైతం స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసింది. తాజాగా.. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే భక్తుల కోసం రెండు రూట్లలో ప్రత్యేక బస్సులు నడపాలని ఏపీటీడీసీ నిర్ణయించింది. ప్యాకేజీ ఖరారు చేసింది.

కుంభమేళా కోసం
ఏపీ, తెలంగాణ నుంచి ప్రయాగ్ రాజ్ లో కుంభమేళాకు వెళ్లే భక్తుల కోసం ఏపీటీడీసీ ప్రత్యేకంగా బస్సులు కేటాయించింది. ఇందు కోసం రెండు రూట్లలో నడపాలని నిర్ణయించారు. ఒక బస్సు ఫిబ్రవరి 11న ఉదయం 6 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరి ఒంటిమిట్ట, కడప బైపాస్‌, ఓర్వకల్లు, కర్నూల్‌ బైపాస్‌, హైదరాబాద్‌, జబల్‌పూర్‌, చిత్రకూటం, కాశీ, నాగపురి ధర్మపురి మీదుగా ప్రయాగ్‌రాజ్‌కు చేరుతుంది. పూర్తి వివరాలకు సీఆర్‌వో, తిరుపతి, 98480 07033, కడప డీజీఎం 90103 18811, కర్నూలు డీవీఎం 96401 77759, హైదరాబాద్‌ ఐఆర్‌వోలను సంప్రదించాలని అధికారులు సూచించారు.

APTDC special buses for Mahakumbh from Telugu states Route and package details here

రూట్ - షెడ్యూల్
అదే విధంగా రెండో ఫిబ్రవరి 12న ఉదయం 6గంటలకు నెల్లూరు రాజరాజేశ్వరి ఆలయం నుంచి బయలుదేరనుంది. నెల్లూరు నుంచి విజయవాడ, రాజమండ్రి, అన్నవరం, విశాఖపట్నం, పూరి, కోణార్క్‌, భువనేశ్వర్‌, కటక్‌, చండీపూర్‌, గయ, బుద్ధగయ, కాశీ, ప్రయాగ్‌రాజ్‌కు చేరుకోనుంది. పూర్తి వివరాలకు నెల్లూరు డీవీఎం 98480 07024, విజయవాడ సీఆర్‌వో 98480 07025, ఐఆర్‌వో రాజమండ్రి 98486 29341, విశాఖపట్నం సీఆర్‌వో 98488 13584, 98480 07022లను సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు.

ప్యాకేజీ ఇలా
ఇక, ప్రయాగ్ రాజ్ కు ధరలను ఖరారు చేసారు. పెద్దలు, పిల్లలకు వేర్వేరుగా ఛార్జీలు వసూలు చేయనున్నారు. విశాఖ నుంచి పెద్దలకు రూ 24,100 కాగా, పిల్లలకు రూ. 21,200 గా ఖరారు చేసారు. అదే విధంగా తిరుపతి నుంచి రూ 22 వేలు, పిల్లలకు 19 వేలు గా నిర్దారించారు. హైదరా బాద్ నుంచి రూ 22 వేలు, పిల్లలకు 17 వేలుగా ఖరారు చేసారు. విజయవాడ నుంచి పెద్దలకు రూ 25,600 కాగా, పిల్లలకు రూ 22,500 గా నిర్ణయించారు. టికెట్ల రిజర్వేషన్‌ www. aptde.in లేదా turijamapgov.in ద్వారా బుక్ చేసుకొనే అవకాశం కల్పించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+