తిరుమల లడ్డూ వివాదం, ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటీషన్
తిరుమల శ్రీవారి లడ్డుల తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారని ఆరోపణలు రావడంతో ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. కోట్లాదిమంది శ్రీవారి భక్తులు తిరుమలకు నెయ్యి పరఫరా చేసిన సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలియుగ వైకుంఠ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువు తీరిన తిరుమలలో లడ్డూల తయారీ విషయంలో రాజకీయాలు చేస్తారా అంటూ కోట్లాదిమంది శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమిళనాడులోని ఏఆర్ డెయిరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తిరుమలలో లడ్డూలు తయారు చేయడానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిందని, ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వివాదం ఇప్పటికే సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది. ఈరోజే సుప్రీం కోర్టు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసి తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ జరిపించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ సమయంలో తమిళనాడులోని దిండిగల్ కు చెందిన ఏఆర్ డెయిరీ ఎండీ ఆర్. రాజశేఖరన్ తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం తిరుమల శ్రీవారి లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్ ముందస్తు బెయిల్ కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు.
రాజశేఖర్ పిటిషన్ పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తదుపరి విచారణ ఈనెల 17వ తేదీకి వాయిదా వేసింది. తమిళనాడులోని దిండిగల్ కు చెందిన ఏఆర్ డెయిరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తిరుమలలో శ్రీవారి లడ్డూలు తయారు చేయడానికి కల్తీ నెయ్యి సరఫరా చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఏఆర్ డెయిరీకి చెందిన నెయ్యిని పరిశీలించిన గుజరాత్ ల్యాబ్ ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని నివేదిక ఇచ్చిందని ఇటీవల ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications