arasavalli rathasapthami: సూర్యనారాయణుడి శోభాయాత్ర.. హెలికాఫ్టర్ నుండి అరసవల్లి అందాలు!

శ్రీకాకుళం జిల్లా కేంద్రం arasavalli rathasapthami కి భక్తిపారవశ్యంలో మునిగితేలింది. సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలను పురస్కరించుకుని నేడు సాయంత్రం నిర్వహించిన శోభాయాత్ర కనులపండువగా సాగింది. 55 రకాలకు పైగా జానపద, సాంప్రదాయ కళారూపాలు, వివిధ క్షేత్రాల దైవ శకటాలతో నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అరసవల్లి సూర్య నారాయణుడి రథ సప్తమి వేడుకలకు ప్రభుత్వం అన్ని విధాలా ఏర్పాట్లు చేసింది.

arasavalli rathasapthami Lord Suryanarayana shobhayatra was a feast for the eyes with 55 art forms

మంగళవాయిద్యాల మధ్య సాగిన సూర్యరథం

నేడు కె.ఆర్.స్టేడియం వద్ద రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తన ధర్మపత్నితో కలిసి స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్ వెంట రాగా సాంప్రదాయ డప్పులు కొట్టి శోభాయాత్రను వైభవంగా ప్రారంభించారు.శంఖారావాలు, మంగళవాయిద్యాల మధ్య సాగిన యాత్రలో సూర్యరథం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సింహాచలం, అన్నవరం, కనకదుర్గమ్మ వంటి ప్రముఖ క్షేత్రాల నమూనా శకటాలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి.

arasavalli rathasapthami Lord Suryanarayana shobhayatra was a feast for the eyes with 55 art forms

55 రకాలకు పైగా జానపద, సాంప్రదాయ కళారూపాలతో శోభాయాత్ర

మహిళల కర్రసాము, అఘోరాల వేషధారణలు, కేరళ డ్రమ్స్, ధింసా నృత్యాలు యాత్రకు వన్నె తెచ్చాయి. డే అండ్ నైట్ జంక్షన్ నుంచి ఏడు రోడ్ల కూడలి, సూర్యమహల్, మిల్ జంక్షన్ మీదుగా అరసవల్లి ఆలయం వరకు సాగిన ఈ ప్రదర్శనను తిలకించేందుకు భక్తజనం పోటెత్తారు. కార్యక్రమంలో అధికార యంత్రాంగం, భక్తులతో కలసి పాల్గొని కళాకారులను ఉత్సాహపరిచారు.

arasavalli rathasapthami Lord Suryanarayana shobhayatra was a feast for the eyes with 55 art forms

దీపాల కాంతుల్లో కళారూపాల ప్రదర్శనలు

యాత్ర ఆద్యంతం క్రమశిక్షణతో సాగేలా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్విరాజ్ కుమార్ దగ్గరుండి పర్యవేక్షించారు. యాత్ర వల్ల దారిపొడవునా భక్తులకు స్వచ్ఛంద సంస్థలు మంచినీరు, ప్రసాద వితరణ చేపట్టాయి. రాత్రి వేళ విద్యుత్ దీపాల కాంతుల్లో కళారూపాల ప్రదర్శనలు పండుగ వాతావరణాన్ని తలపించాయి.

arasavalli rathasapthami Lord Suryanarayana shobhayatra was a feast for the eyes with 55 art forms

అరసవల్లిలో హెలికాఫ్టర్ రైడ్స్, హాట్ ఎయిర్ బెలూన్ రైడ్స్

మరోవైపు అరసవల్లి పుణ్యక్షేత్రంలో రథసప్తమి వేడుకల సందర్భంగా జిల్లా యంత్రాంగం హెలికాప్టర్ రైడ్స్, హాట్ ఎయిర్ బెలూన్ రైడ్స్ ను అందుబాటులోకి తెచ్చింది జనవరి 19వ తేదీ నుండి ప్రారంభమైన ఈ వైమానిక వ్యవహారాలు భక్తులకు పర్యాటకులకు కొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి. హెలికాప్టర్ రైడ్స్ కు 2002 వందల రూపాయలు చార్జీ నిర్ణయించగా , హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ ధర మొదట వెయ్యి రూపాయలు పెట్టి ఆ తర్వాత భక్తుల విజ్ఞప్తి మేరకు 799 రూపాయలకు తగ్గించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+