TTD: అలిపిరికి కొత్త రూపు, మహా మండపం తరహాలో - ఆనంద్‌సాయికి బాధ్యతలు..!!
Tirumala: తిరుమలకు వచ్చే దారులకు కొత్త శోభ తెచ్చేందుకు టీటీడీ నిర్ణయించింది. కోట్లాది భక్తులు తరలి వచ్చే తిరుపతి - తిరుమల వైభవం పెరిగేలా ప్రణాళికలు సిద్దం చేసింది. తాజాగా జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో తిరుపతి విమానశ్రయానికి శ్రీవారి పేరు పెట్టాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. అదే విధంగ అలిపిరి లో బేస్ క్యాంప్ ఏర్పాటు దిశగా కసరత్తు జరుగుతోంది. ఇప్పుడు అలిపిరి వద్ద నుంచి వచ్చే భక్తులకు మహా మండపం లోకి వచ్చే అనుభూత కలిగేలా కొత్త డిజైన్లతో మార్పులు చేయనుంది. ఈ మేరకు బాధ్యతలను బోర్డు సభ్యుడు.. ఆర్కిటెక్ట్ ఆనంద సాయికి బాధ్యత అప్పగించారు.
కొత్త రూపుతో
తిరుపతి విమానశ్రాయం.. అలిపిరి ఆర్చ్ కు కొత్త రూపు వచ్చేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. తిరుమల ఐకానిక్‌గా ఆధ్యాత్మిక శోభను తీసుకువచ్చేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. దీంతో, వాటి డిజైన్లలో ఆర్ట్ డైరెక్టర్, టెంపుల్ ఆర్కిటెక్ట్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్‌సాయి బాధ్యత తీసుకున్నారు. నిత్యం వేలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే తిరుపతి విమానాశ్రయంలో తిరుమల శోభ ఉండేలా మార్పులకు శ్రీకారం చుట్టారు. దీంతో, తొలి ప్రాధాన్యతగా తిరుపతి ఎయిర్‌పోర్టుకు 'శ్రీవేంకటేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు'గా పేరు పెట్టాలని తీర్మానం చేసి కేంద్ర విమానయాన శాఖకు ప్రతిపాదన పంపాలని నిర్ణయించారు. అలాగే బోర్డు సభ్యుడు ఆనంద్‌సాయి ప్రతిపాదన మేరకు ఎయిర్‌పోర్టును పూర్తిస్థాయిలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ వైభవంతో ఆధ్యాత్మిక వాతావరణం ఉండేలా తీర్చిదిద్దాలని నిర్ణయించారు.

అలిపిరి ఆర్చ్ కోసం
అదే విధంగా అలిపిరి గరుడ సర్కిల్‌లోని ఆర్చిని కూడా ఆధునికీకరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం, శంషాబాద్ సమీపంలోని రామానుజా చార్యుల ఆశ్రమ రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన ఆనంద్‌సాయికే ఈ బాధ్యత అప్పగించారు. తన ప్రణాళికల పైన ఆనంద్ సాయి స్పందించారు. కొద్ది నెలల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు కాలినడకన తిరుమలకు వచ్చిన సందర్భంలో అలిపిరి నుంచి శ్రీవారి ఆలయం వరకు చేపట్టాల్సిన అభివృద్ధి, ఆధ్యాత్మిక వాతావరణంపై చర్చించు కున్నట్లు చెప్పారు. ఓ మహా మండపంలోకి ప్రవేశిస్తున్నామనే భావన భక్తులందరికీ కలిగేలా అలిపిరి ఆర్చిని డిజైన్ చేసేలా ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
కొత్త అనుభూతి
ప్రస్తుతం ఇండోనేషియా తరహాలో ఉన్న ఎయిర్‌పోర్టును కూడా తిరుమల క్షేత్రం భావన కలిగేలా తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తున్నామన్నారు. ఇప్పటికే న మదిలో ఒక డిజైన్ సిద్దం చేసినట్లు చెప్పారు. బోర్డు.. పవన్.. చంద్రబాబుతో చర్చించి.. ఆమోదిస్తామని ఆనంద్ సాయి చెప్పుకొచ్చారు. ఇది మొదలైతే.. తిరుమల భక్తులకు కొత్త అనుభూతి కలగనుంది.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..!












Click it and Unblock the Notifications