పవన్ కళ్యాణ్ టు దాసరి.., బిజెపి ఎదురుదాడి: అన్నివైపులా బాబు కార్నర్

విజయవాడ: ఏపీలో ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఏకాకి అయ్యారా? 2014 సార్వత్రిక ఎన్నికల్లో అండగా నిలిచిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, మిత్రపక్షం బిజెపి క్రమంగా దూరం పాటిస్తున్నాయా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.

గత సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ, ఏపీలలో బిజెపి - టిడిపి మిత్రపక్షాలుగా పోటీ చేశాయి. జనసేన ఆ మిత్రపక్షానికి మద్దతు పలికింది. తెలంగాణ, ఏపీలలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టిడిపికి బిజెపి క్రమంగా దూరం అవుతోంది.

పవన్ కళ్యాణ్ కూడా వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో టిడిపితో జత కట్టే అవకాశాల్లేవని, బిజెపితోనే దోస్తీ ఉంటుందనే వాదనలు ఇప్పటికే ఉన్నాయి. మరోవైపు, రాజకీయాల్లోకి రానని చెప్పినప్పటికీ.. తెరపైకి దాసరి నారాయణ రావు వచ్చారు.

దాసరి నారాయణ రావు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు సంఘీభావం తెలిపేందుకు గతంలో ప్రయత్నిచారు. అప్పుడు ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత, ఆయన పవన్ కళ్యాణ్ పైన, జగన్ పైన ప్రశంసలు కురిపిస్తూ మాట్లాడారు. కాపు రిజర్వేషన్లు, ప్రత్యేక హోదా పైన పవన్ ఆచితూచి స్పందించారు.

 All are targetting AP CM Chandrababu Naidu

కాపు రిజర్వేషన్ విషయంలో ఓ వైపు చంద్రబాబును తప్పుబడుతూ.. మరోవైపు, జగన్, పవన్ కళ్యాణ్‌లను మెచ్చుకున్నారు. ఇది ఓ విధంగా చంద్రబాబుకు ఇబ్బందికరమైన విషయమేనని చెప్పవచ్చు. ప్రస్తుతానికి చంద్రబాబు నలువైపులా టార్గెట్ అయ్యారని చెప్పవచ్చు.

ఓ వైపు తెలంగాణలో కృష్ణా, గోదావరి నదుల పైన కడుతున్న ప్రాజెక్టుల విషయంలో వైసిపి అధినేత జగన్ ఏపీ సీఎం చంద్రబాబును నిలదీస్తున్నారు. ప్రత్యేక హోదా అంశంలోను కాంగ్రెస్, వైసిపిని చంద్రబాబును టార్గెట్ చేస్తున్నాయి.

ఇక, తెలంగాణ - ఏపీ రాష్ట్రాలకు సంబంధించిన అంశాల్లో.. ఏపీలో టిడిపి అధికారంలో ఉన్నందున.. చంద్రబాబు ప్రభుత్వమే ప్రధాన టార్గెట్‌గా మారింది. ప్రత్యేక హోదా, తెలంగాణ ప్రాజెక్టులు, తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు.. ఇలా అన్ని విషయాల్లోను బాబును కార్నర్ చేస్తున్నారు.

ప్రత్యేక హోదా విషయంలో బిజెపిని విపక్షాలు తప్పుబడుతున్నప్పటికీ.. నిధుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం లెక్క చెప్పాలని బిజెపి ఎదురు దాడికి దిగుతోంది. ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదని కేంద్రమంత్రి హెచ్ పి చౌదరి తేల్చినప్పటికీ బిజెపి నిధులు అంటూ చంద్రబాబుపై ప్రతి దాడి చేస్తోంది. ఇక, 2019లో పోటీ చేస్తానని చెబుతున్న పవన్‌కు, ప్రతిపక్ష నేత జగన్‌కు దాసరి కితాబివ్వడం చంద్రబాబుకు మరో షాక్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+