world kidney day: ప్రతిరోజు ఇవి తీసుకుంటే మీరే డాక్టర్?
చిలగడదుంప బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.
అవయవాల ప్రాముఖ్యతను గుర్తించేందుకు ప్రతి ఏడాది మార్చి 9న ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మానవ శరీరంలో మూత్రపిండాలు అత్యంత ముఖ్యమైన భాగం. విషాన్ని, వ్యర్థాలను విసర్జించడంద్వారా రక్తాన్ని శుద్ధి చేస్తాయి. కిడ్నీలవల్ల అనారోగ్యం రాకుండా ఉండాలంటే రెండే మార్గాలున్నాయి. ఒకటి ఎక్కువ నీరు తాగడం, రెండు.. వ్యాయామం చేయడం. వ్యాయామం ద్వారా మిమ్మల్ని మీరు ఫిట్ గా ఉంచుకోవడమే కాకుండా మంచి ఆహారం తీసుకోవడంద్వారా మూత్రపిండాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించవచ్చు. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..
*క్యాబేజీలో విటమిన్ సి, విటమిన్ కెతో సహా అనేక ఉపయోగకరమైన విటమిన్లు ఉన్నాయి సహజంగా సోడియం కూడా తక్కువగా ఉంటుంది. క్యాబేజీలో ఫైబర్ పుష్కలంగా ఉండటంతో జీర్ణాశయ వ్యవస్థ శుభ్రంగా పనిచేస్తుంది.

*చిలగడదుంపలో అధిక మొత్తంలో విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
*కాలీఫ్లవర్ విటమిన్ సి, విటమిన్ కె మరియు బి, ఫోలేట్, ఫైబర్స్, ఇండోల్స్‌తో సహా ఇతర పోషకాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలతో నిండి ఉన్నాయి
*ఉల్లిపాయలు అన్ని రకాల భోజనంలో ఉపయోగించే ముఖ్యమైన పదార్థాలలో ఉల్లిపాయ ఒకటి. ఇందులో విటమిన్ సి, మాంగనీస్, విటమిన్ బి, ప్రీబయోటిక్ ఫైబర్స్ ఉంటాయి.
*వెల్లుల్లిని మనం వండే ఆహారానికి రుచులను జోడించడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు, అయితే ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలున్నాయి. వెల్లుల్లిలో విటమిన్ బి6, విటమిన్ సి, సల్ఫర్, మాంగనీస్ కూడా ఉన్నాయి.
*గుడ్డులోని తెల్లసొనలో ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఇది మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
ఆపిల్ రోజుకు ఒక యాపిల్ తింటే వైద్యులను దూరంగా ఉంచుతుందంటారు. యాపిల్స్‌లో అధిక ప్రోటీన్ కంటెంట్ ఉంది. ఇది కిడ్నీ దెబ్బతినడానికి సంబంధించిన *ప్రమాద కారకాలను తగ్గిస్తుంది.
*సిట్రస్ పండ్లు. మీ కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి విటమిన్ సిని ఎక్కువగా తీసుకోవాలి సిట్రస్ పండ్లు ఉత్తమం నారింజ, నిమ్మకాయలు మొదలైనవాటిలో పుష్కలంగా విటమిన్ సీ లభిస్తుంది.












Click it and Unblock the Notifications