జగన్ పుట్టిన రోజు..ఆకట్టుకుంటున్న అల్లు అర్జున్ ఫ్లెక్సీ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను నేడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. పార్టీ శ్రేణులు పెద్దయెత్తున కార్యక్రమాలను చేపడుతున్నారు. అన్ని చోట్ల రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. నియోజకవర్గ కేంద్రాల్లో జగన్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేయించిన కేక్‌ను నాయకులు కట్ చేస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ వైసీపీ నేతలు భారీ ఎత్తున జగన్ పుట్టిన రోజు వేడుకలను జరపాలని నిర్ణయించారు. అనేక చోట్ల పేదలకు అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

దీంతో పాటు ఆసుపత్రిలోని రోగులకు నేతలు పండ్లు, రొట్టెలు పంపిణీ చేయనున్నారు. జగన్‌కు పలువురు నేతలు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టీడీపీ అధినేత ,సీఎం చంద్రబాబు సైతం జగన్‌కు బర్త్ డే విషెష్ తెలిపారు.వైఎస్ జగన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మంచి ఆరోగ్యంతో దీర్ఘాయువు పొందాలని కోరుకుంటున్నాను'' అంటూ సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా ట్విట్ చేశారు. మరోవైపు, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో ధీర్ఘకాలం ప్రజాసేవలో కొనసాగాలని గవర్నర్ ఆకాంక్షించారు.

Arjun fans wish Jagan a happy birthday and set up a flexi

ఇదిలా ఉంటే జగన్ పుట్టిన రోజు సందర్భంగా అల్లు అర్జున్ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఒకటి అందర్ని ఆకట్టుకుంటుంది. ''రాజు బలవంతుడైనప్పుడే శత్రవులు అందరూ ఏకం అవుతారు'' అనే కొటేషన్‌ను ఈ బ్యానర్‌లో పొందుపరిచారు. ఈ ఫ్లెక్సీలో జగన్‌తో పాటు అల్లు అర్జున్ ఫొటో కూడా పెట్టడం జరిగింది. గత కొంతకాలంగా అల్లు అర్జున్‌కు వైసీపీ అండగా నిలుస్తోంది. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సమయంలో జగన్ సైతం దాన్ని ఖండించారు. అల్లు అర్జున్‌కు బెయిల్ ఇప్పించడంలో వైసీపీ ఎంపీ, లాయర్ నిరంజన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఈ కారణంగానే అల్లు అర్జున్ అభిమానులు జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+