మున్సిపల్ ఎన్నికలపై ఆర్నాబ్ తుఫాన్ ఎఫెక్ట్, కీలక నిర్ణయం..!!

మున్సిపల్ ఎన్నికల పై ఆర్నాబ్ తుఫాను ఎఫెక్ట్ కనిపిస్తోంది. అటు తుఫాను తీవ్ర రూపం దాల్చు తోంది. 12 జిల్లాల పైన ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. కోనసీమ పైన విరుచుకుపడే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. దీంతో.. ఎన్నికల ప్రచారం చేసే అభ్యర్ధుల కు సమస్యగా మారుతోంది. ప్రత్యామ్నాయ మార్గాల పైన ఫోకస్ చేస్తున్నారు. ఈ నెల 29వ తేదీ వరకు ప్రచారం కొనసాగనుంది. నవంబర్ 1వ తేదీ పోలింగ్ జరగనుంది. అయితే.. తుఫాను తీవ్రత ఆధారంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

ఆర్నాబ్ తుఫాను తీర ప్రాంతాన్ని వణికిస్తోంది. ఇప్పటికే తుఫాను ప్రభావం మొదలైంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంతో పాటుగా తూర్పు గోదావరి జిల్లాల్లో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కోనసీమ జిల్లా పైన తుఫాను విరుచుకుపడే అవకాశాల పైన అంచనాలు వెల్లడిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్నబ్​ హై అలర్ట్​ కొనసాగుతోంది. ఈ క్రమం లో నే అతి తీవ్రతుపాను 'అర్నబ్‌'ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర యంత్రాంగం సమాయత్తం అవుతుంది. తీవ్ర తుపానుగా తీరం దాటనుండడంతో భారీ గాలుల ముప్పుతో పాటు తీర ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకుపైగా వర్షం కురిసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గాలుల వేగం 115 కి.మీ నుంచి 125 కి.మీ. వరకు ఉండొచ్చు. కొన్నిసార్లు గాలుల వేగం 140 కి.మీ. వరకు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఏకగ్రీవాలు, మున్సిపల్ ఎన్నికల కొనసాగింపు పై కొత్త టెన్షన్ - కీలక పరిణామాలు, నేడే నిర్ణయం..!?
ఏకగ్రీవాలు, మున్సిపల్ ఎన్నికల కొనసాగింపు పై కొత్త టెన్షన్ - కీలక పరిణామాలు, నేడే నిర్ణయం..!?
arnab-cyclone-impact-on-municipal-elections-in-ap-key-decisions-likely-to-announce

తుఫాను పై నిరంతర సమీక్ష

దీంతో, మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరా హోరీగా సాగుతున్న వేళ తుఫాను ప్రభావం స్పష్టం గా కనిపిస్తోంది. అభ్యర్ధులు డిజిటల్ ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. వాట్సాప్, ఇన్‌ స్టా, ఫేస్‌బుక్‌ల్లో ప్రచారం హోరెత్తుతోంది. ఓటర్ల కు వాయిస్ కాల్స్, వాయిస్ మెసేజ్‌లు పంపడంతోపాటు రాష్ట్రస్థాయి ముఖ్యనేతల వాయిస్‌తో IVRS కాల్స్ చేస్తున్నారు. ఓటర్ స్లిప్‌లను కూడా మొబైల్స్‌కే పంపుతున్నారు. ఈ మూడురోజుల పాటు డిజిటల్ ప్రచారంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అయితే, నవంబర్ 1వ తేదీన ఎన్నికలు జరగాల్సి ఉంది. తుఫాను తీవ్రత.. తదనంతర పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+