హైదరాబాద్ నుంచి అసదుద్దీన్ నామినేషన్ (పిక్చర్స్)
హైదరాబాద్: హైదాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గానికి గురువారం ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ నామినేషన్ దాఖలు చేశారు. దారుస్సలాంలోని పార్టీ కార్యాలయం నుంచి అనుచరగణంతో కలిసి నాంపల్లిలోని హైదరాబాద్ కలెక్టరేట్‌లో రిటర్నింగ్ అధికారి ముఖేష్ కుమార్ మీనాకు నామినేషన్ పత్రాలు అందజేశారు.
ఆ తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ దఫా ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తులుండవని, ఒంటరిగానే పోటీ చేసి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమావ్యక్తం చేశారు. ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో విజయం సాధించి హ్యాట్రిక్ అందుకుంటానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇక నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎంఐఎం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. హైదరాబాద్ పునర్ నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తామని అసద్ అన్నారు. అలాగే హైదరాబాద్‌లోని సీమాంధ్ర ప్రజలకు తమ పార్టీ అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. 2004, 2009లో హైదరాబాద్ పార్లమెంట్ బరిలో దిగిన అసదుద్దీన్ ఓవైసీ తిరుగులేని మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

అసదుద్దీన్ ఓవైసీ ఇలా..
హైదరాబాద్ లోకసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇలా ప్రార్థన చేస్తూ కనిపించారు.

అసదుద్దీన్ ప్రార్థనలు...
హైదరాబాద్ లోకసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన సందర్బంగా గురువారం అసదుద్దీన్ ఓవైసీ ఇలా ప్రార్థన చేశారు.

అభిమానుల అండదండలు..
హైదరాబాద్ లోకసభ సభ్యుడు, మజ్లీస్ అధినేత అసదుద్దీన్‌కు హైదరాబాద్ పాతబస్తీలో అండదండలు దండిగానే ఉన్నాయి.

అసదుద్దీన్ ఇలా..
హైదరాబాద్ లోకసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా గురువారం మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇలా కనిపించారు.

అసదుద్దీన్‌తో అభిమానులు..
మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ లోకసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ఇలా కనిపించారు.

ఇలా అభిమానం...
హైదరాబాద్ లోకసభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ గురువారం లోకసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ఆయనపై ఈ విధంగా అభిమానం వెల్లువెత్తింది.












Click it and Unblock the Notifications