ఆ హక్కులేదు: చిరుకు అశోక్ సవాల్: రేణుకVsరాంరెడ్డి

ఈ సందర్భంగా అశోక్ బాబు విలేకరులతో మాట్లాడారు. చిరుకు తన రాజీనామా అడిగే నైతిక హక్కు లేదన్నారు. సీమాంధ్ర కేంద్రమంత్రులు రాజీనామా చేస్తే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. కాగా, కేంద్రమంత్రులు రాజీనామా చేయాలని అశోక్ బాబు పదే పదే డిమాండ్ చేస్తుండటంతో శనివారం చిరంజీవి స్పందించిన విషయం తెలిసిందే. అశోక్ బాబు రాజీనామా చేయకుండా తమను డిమాండ్ చేయడమేమిటని ప్రశ్నించారు. దీనికి అశోక్ బాబు కౌంటర్ ఇచ్చారు.
టిని అడ్డుకునేందుకే: మధుయాష్కీ
తెలంగాణను అడ్డుకోవడానికే హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయాలని సీమాంధ్ర నాయకులు డిమాండ్ చేస్తున్నారని నిజామాబాద్ ఎంపి మధుయాష్కీ అన్నారు. హైదరాబాుదలో అక్రమంగా సంపాదించిన ఆస్తులను కాపాడుకునేందుకు సీమాంధ్రలో నాయకులు ఈ ప్రస్తావన తేవడం సరికాదన్నారు ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ ఖాయమన్నారు.
రేణుక వర్సెస్ రాంరెడ్డి
ఖమ్మం జిల్లా కారేపల్లిలో ఆదివారం ఉద్రిక్తతత తలెత్తింది. కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరిని రాంరెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత తలెత్తింది. కారేపల్లిలో రాంరెడ్డి వర్గీయులు జిల్లాకు వచ్చిన రేణుకను అడ్డుకున్నారు. ముత్యాలంపాడులో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. రేణుక వర్గీయులు రాంరెడ్డి వర్గీయులపై టేకులపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications