• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టిడిపిలో అశోక్‌బాబు అధికారిక ఎంట్రీ : ఎమ్మెల్సీ ప‌ద‌వికి హామీ : పార్టీలో భిన్నాభిప్రాయాలు..!

|

ఏపిఎన్జీవో అధ్య‌క్షుడు అశోక్‌బాబు అధికారికంగా టిడిపిలోకి ఎంట్రీ ఖ‌రారైంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆహ్వానం మేర‌కు అశోక్‌బాబు ఈ నెలాఖ‌రులోగా టిడిపిలో చేర‌నున్నారు. ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి సైతం ఇస్తున్న‌ట్లు హామీ ల‌భించింది. అయితే, అశోక్‌బాబు కు నేరుగా ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇవ్వ‌టం వ‌ల‌న పార్టీకి క‌లిగే ప్ర‌యోజ‌నాల పై చ‌ర్చ మొద‌లైంది. దీని పై పార్టీ నేత‌ల్లోనే భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.

ప‌ద‌వీ విర‌మ‌ణ‌..రాజ‌కీయాల్లోకి ఎంట్రీ

ప‌ద‌వీ విర‌మ‌ణ‌..రాజ‌కీయాల్లోకి ఎంట్రీ

వాణిజ్య పన్నుల శాఖ‌లో అధికారిగా ప‌ని చేస్తూ..ఎన్టీఓ నేత‌గా వ్య‌వ‌హ‌రించిన ఆశోక్ బాబు 2014 లో రాష్ట్ర విభ‌జ‌న స‌మ యంలో తెర మీద‌కు వ‌చ్చారు. స‌మైక్యాంధ్ర‌ప్ర‌దేశ్ కోసం అన్ని వ‌ర్గాలు క‌లిసి జేఏసి గా ఏర్ప‌డి దానికి అశోక్ బాబును ఛైర్మ‌న్ గా ఎన్నుకున్నారు. ఆయ‌న నాయ‌క‌త్వంలోనే అప్పుడు స‌మైక్యాంధ్ర కోసం ఏపి లో నిర‌వ‌ధిక నిర‌స‌న‌లు కొన‌సా గాయి. ఆ త‌రువాత రాష్ట్ర విభ‌జ‌న‌..టిడిపి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత అశోక్‌బాబుకు ప్ర‌భుత్వంలో ప్రాధాన్య‌త పెరి గింది. అదే విధంగా అశోక్ బాబు తీరు పై వ్య‌తిరేక‌త క‌నిపించింది. ఇక‌, ప్ర‌భుత్వానికి ప్ర‌తీ సంద‌ర్భంలోనూ అశోక్ బాబు మ‌ద్ద‌తుగానే వ్య‌వ‌హ‌రిస్తూ..ఉద్య‌గుల కంటే త‌న వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల కోసమే ప‌ని చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపించాయి. ఇక‌, అశోక్‌బాబు విద్యార్హ‌త పైనా అనుమానాలు ఉన్నాయి. దీని పై కేసులు నమోద‌య్యాయి. అయితే, ప్ర‌భుత్వ అధికారిగా ఉన్న అశోక్‌బాబు రాజ‌కీయాల్లోకి రావాల‌ని న‌వ నిర్మాణ దీక్ష వేదిక‌గా ముఖ్య‌మంత్రి ఆహ్వానించా రు. అప్ప‌టి నుండే అశోక్ బాబు టిడిపి లో చేరుతున్నార‌నే వాద‌న‌లు మొద‌ల‌య్యాయి.

ఏపి ఎన్టీవో కు కొత్త సార‌ధి...

ఏపి ఎన్టీవో కు కొత్త సార‌ధి...

అశోక్‌బాబు ఉద్యోగానికి స్వ‌చ్చంద ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌టం..రాజకీయాల్లోకి ప్ర‌వేశిస్తుండ‌టంతో..ఇప్పుడు ఏపి ఎన్జీవో సంఘానికి కొత్త సార‌ధి రానున్నారు. అశోక్‌బాబు నిర్ణ‌యం తో ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు, ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ పోస్టులు ఖాళీ అయ్యాయి. ప్రస్తుతం ఎన్జీవోల ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి ఈ రెండు బాధ్యతలూ చేపట్టనున్నట్లు తెలిసింది. శని, ఆదివారాల్లో ఎన్జీవోల సంఘం కార్యనిర్వాహక సమావేశం నిర్వహించి ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

టిడిపి లో అంత‌ర్మ‌ధ‌నం.

టిడిపి లో అంత‌ర్మ‌ధ‌నం.

రాష్ట్ర విభ‌జ‌న‌..టిడిపి ప్ర‌భుత్వం ఏర్పాటు నుండి అశోక్‌బాబు టిడిపి కి మ‌ద్ద‌తుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే అభిప్రాయం ఉద్యోగ సంఘంలోని కొంద‌రు నేత‌లే వ్య‌క్తం చేసేవారు. ఇప్ప‌టికీ అశోక్‌బాబుకు వ్య‌తిరేకంగా కొన్ని ఉద్యోగ సంఘాల నేత‌లు అసంతృప్తి వ్య‌క్తం చేస్తూనే ఉన్నారు. ఇదే స‌మ‌యంలో ఏకంగా టిడిపి లో ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇవ్వాల‌నే నిర్ణ‌యా న్ని కొంద‌రు టిడిపి నేత‌లు త‌ప్పు బ‌డుతున్నారు. పార్టీలో ప‌ని చేసే వారి కంటే బ‌య‌ట నుండి వ‌చ్చిన వారికి ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్రాధాన్య‌త ఇస్తూ నిర్ణ‌యాలు తీసుకుంటే పార్టీకి న‌ష్టం చేస్తాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇక‌, ఉద్యోగ సంఘ నేత‌గా వ్య‌వ‌హ‌రించిన అశోక్‌బాబు అన్ని వ‌ర్గాల ఉద్యోగుల్లో మంచి స్థానం సంపాదించ లేక‌పోయార‌ని అటువంటి వారికి ఎమ్మెల్సీ ఇవ్వ‌టం ద్వారా..వారి వ్య‌క్తిగ‌త అసంతృప్తి పార్టీ పై ప్ర‌భావం ప‌డుతుంద‌ని వివ‌రిస్తున్నారు . క‌ర్నాట‌క ఎన్నిక‌ల స‌మ‌యంలో అశోక్‌బాబు టిడిపిక అనుకూలంగా అక్క‌డికి వెళ్లి వ్య‌వ‌హ‌రించారు. అటువంటి వ్య‌క్త కి ఎమ్మెల్సీ ఇవ్వ‌టం త‌ప్పు కాద‌ని మ‌రి కొంద‌రి వాద‌న‌. దీంతో..అశోక్‌బాబు టిడిపి లో చేరే స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి చేసే ప్ర‌క‌ట‌న‌ల పై పార్టీ నుండి ఎటువంటి స్పంద‌న వ‌స్తుందో చూడాలి.

English summary
APNGO leader Ashok Babu resigned his job ready to join in TDP in this month. Chandra babu ready to give MLC for Ashok Babu. APNGO new president will be elected.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X