సోనియా పటాన్ని కాల్చిన అశోక్, ఇంకా కుట్రలని కోదండ

హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు సోమవారం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చిత్రపటాన్ని తగులబెట్టారు. ఈ రోజు సోనియా జన్మదినం. 2009 డిసెంబర్ 9న కాంగ్రెసు తెలంగాణను ప్రకటించింది. దానిని నిరసిస్తూ సీమాంధ్రలో ఆందోళనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అశోక్ బాబు సోనియా చిత్ర పటాన్ని తగులబెట్టారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.

తాము ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు మరోసారి సమావేశమవుతామని చెప్పారు. అసెంబ్లీ బిల్లు తెలంగాణకు వచ్చిన సమయంలో తాము విధులను బహిష్కరిస్తామని, ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. దీనికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. సమైక్యాంధ్ర కోసం తాము మజ్లిస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను కలవాల్సి ఉందని తెలిపారు.

Ashok Babu for Samaikyandhra, Kodanda for Telangana justice

సమ్మెకాలంలో ఎపిఎన్జీవోల వేతనాలను కట్ చేయడం సరికాదన్నారు. ఉద్యమంలో ఎలా ముందుకు వెళ్లాలో అఖిలపక్షం, ప్రజా సంఘాలతో కలిసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. విభజన బిల్లులోని చట్టవిరుద్ధ అంశాలపై తాము రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాస్తామని చెప్పారు.

అడ్డుకునే కుట్రలు: కోదండరామ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అడ్డుకునే కుట్ర ఇంకా కొనసాగుతోందని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ అన్నారు. ముసాయిదా బిల్లులో చాలా సవరణలు జరగాల్సి ఉందన్నారు. యథాతథంగా ఆమోదం తాము ఒప్పుకోమన్నారు.

ముసాయిదా బిల్లులోని అభ్యంతరాలపై తాము అన్ని పార్టీలకు నివేదికలు ఇస్తామన్నారు. సాగునీరు, ఉద్యోగాలు, విద్య తదితర విషయాల్లో సవరణలు జరగాల్సి ఉందన్నారు. ఈ నెల 11న జెఏసి స్టీరింగ్ కమిటీ భేటీ అవుతుందని చెప్పారు. ఉద్యోగుల ఆప్షన్ విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, తెలంగాణ బిల్లు డ్రాఫ్టుతో 610 జివోను రద్దు చేయాలని చూస్తున్నారని ఉద్యోగ సంఘాల నేతలు దేవీప్రసాద్, విఠల్‌లు అన్నారు.

నదీ జలాల బోర్డులకు

విభజన బిల్లు ముసాయిదాలో అభ్యంతరాలు ఉంటే తమ పార్టీ నేత సుష్మా స్వరాజ్ పార్లమెంటులో ప్రస్తావిస్తారని బిజెపి నేత నాగం జనార్ధన్ రెడ్డి వేరుగా అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయాల వైపు చూస్తున్న సీమాంధ్ర నేతలు ఆంధ్ర విశ్వవిద్యాలయాల్లో తెలంగాణ విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తారా చెప్పాలన్నారు. నదీ జలాల బోర్డులకు విశేష అధికారులు ఇవ్వడం సరికాదని తెరాస శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు వేరుగా అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+