పవన్ కల్యాణ్‌పై అశోక్ గజపతి రాజు అప్పుడలా, ఇప్పుడిలా!

విజయనగరం: టిడిపి సీనియర్ నాయకుడు మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు...పది నెలల క్రిందట పవన్ కళ్యాణ్ విమర్శలకు స్పందిస్తూ అసలు ఆయనెవరో తెలియదని వ్యాఖ్యలు చేసిన ఈ టిడిపి సూపర్ సీనియర్ లీడర్...ఇప్పుడు మాట మార్చారు.

తెలుగుదేశం ప్ర‌భుత్వం అవినీతికి పాల్ప‌డిదంటున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆ విషయం సాక్ష్యాధారాల‌తో నిరూపించాల‌ని అన్న అశోక్ గజపతి రాజు...మరో ప్రశ్నకు సమాధానంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ చాలా పెద్ద‌వార‌ని, ఆయ‌న‌కున్న ఫ్యాన్ ఫాలొయింగ్ త‌న‌కు లేద‌ని...తాను ఓ సామాన్య కార్య‌క‌ర్త‌న‌ని అనడం విశేషం. కేంద్ర మంత్రి ప‌ద‌వికి రాజీనామాచేసిన అనంతరం తొలిసారిగా సొంత జిల్లా విజ‌య‌న‌గ‌రంకు విచ్చేసిన ఎంపీ అషోక్ గ‌జ‌ప‌తి రాజుకు టిడిపి శ్రేణులు ఘ‌న‌స్వాగ‌తం పలికాయి.

కేంద్ర మంత్రి పదవికి...రాజీనామా చేసాక...ఇంటిబాట

కేంద్ర మంత్రి పదవికి...రాజీనామా చేసాక...ఇంటిబాట

ఎపికి కేంద్ర ప్రభుత్వం అన్యాయానికి నిరసనగా తలెత్తిన పరిణామాల నేపథ్యంలో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన టిడిపి నేత అశోక్ గజపతి రాజు...తదనంతరం తొలిసారిగా స్వస్థలం విజయనగరం జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా టిడిపి శ్రేణులు, అశోక్ గజపతిరాజు అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా విజ‌య‌న‌గ‌రం జిల్లా, రాజ‌పులోవ నుంచి తెలుగు త‌మ్ముళ్లు భారీ ర్యాలీ నిర్వ‌హించారు. అనంతరం ఆయన పైడిత‌ల్లి అమ్మ‌వారిని ద‌ర్శించుకొని అషోక్ కుటుంబ స‌భ్యులు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.

మీడియాతో...అశోక్ గజపతి వ్యాఖ్యలు...

మీడియాతో...అశోక్ గజపతి వ్యాఖ్యలు...

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఏపి కు ప్ర‌త్యేక హోదా సాధించేందుకు చేప‌ట్టిన ఉద్య‌మాన్ని మ‌రింత ఉదృతం చేస్తామ‌ని స్ప‌ష్టంచేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వున్న స‌మ‌స్య‌ల‌ప‌ట్ల కేంద్రం ఏమాత్రం స్పందించ‌డం లేద‌న్నారు. బిజెపి భాద్య‌త‌ క‌లిగిన ప్ర‌భుత్వంలాగా క‌నిపించ‌డం లేద‌న్నారు. తెలుగువారికి క‌ష్ట‌ప‌డే త‌త్వం, త్యాగం చేసే గుణం వుంద‌ని, తెలుగువారిని ఇబ్బందికి గురిచేస్తే వారి ఆగ్ర‌హానికి గురి కాక త‌ప్ప‌ద‌న్నారు. ఎవ్వ‌రికి భ‌య‌ప‌డేదిలేద‌ని అశోక్ గజపతి రాజు ఈ సందర్భంగా స్ప‌ష్టంచేశారు.

పవన్ నుద్దేశించి...నాడు అలా...నేడు ఇలా!

పవన్ నుద్దేశించి...నాడు అలా...నేడు ఇలా!

గత ఏడాది మే నెలలో టీటీడీ ఈవోగా ఉత్తరాదికి చెందిన ఐఏఎస్ అధికారిని నియమించడంపై పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్‌పై ఓ మీడియా ప్రతినిధి తనను అడిగిన ప్రశ్నకు సమాధానంగా..."ఆయనెవరో నాకు ఐడియా లేదు...అందరూ అంటున్నారు...ఎవరో సినిమావాడట...నేను సినిమాలు చూసి చాలా ఏళ్లైంది. సినిమాల గురించి మాట్లాడితే నేనేం చెప్పను"... అని అశోక్ గజపతి రాజు వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించింది...అయితే ఇప్పుడు అదే అశోక్ గజపతి రాజు పవన్ టిడిపిపై చేసిన ఆరోపణలను ఆధారాలతో నిరూపించాలంటూనే...ప‌వ‌న్ క‌ళ్యాణ్ పెద్ద‌వార‌ని, ఆయ‌న‌కున్న ఫ్యాన్స్ ఫాలొయింగ్ త‌న‌కు లేద‌ని...తాను ఓ సామాన్య కార్య‌క‌ర్త‌న‌ని వ్యాఖ్యానించడం గమనార్హం...దీంతో అశోక్ గజపతి రాజు మాటల్లో ఇంత వ్యత్యాసం రావడానికి కారణం ఏమిటా అని షాక్ తినడం విలేకరుల వంతైంది.

మారిన మాట తీరుపై...విశ్లేషణలు

మారిన మాట తీరుపై...విశ్లేషణలు

పవన్ కళ్యాణ్ పై ఎప్పటి లాగానే వ్యంగ వ్యాఖ్యానాలు చేస్తారని భావించిన విలేకరులు...అశోక్ గజపతి రాజు ఒక్కసారిగా మాట మార్చడంతో షాక్ తిన్నారు. అప్పుడేమో అసలు పవన్ కళ్యాణెవరో తనకు తెలియదని వ్యాఖ్యానించిన ఈ టీడీపి సీనియర్ ఇప్పుడు ఇలా మాట మార్చడం వెనుక కారణం ఏమైఉంటుందనేది మీడియా వర్గాల్లోనూ చర్చనీయాంశం అయింది. ఎంతైనా రాజకీయ నాయకుడు కాబట్టి...ఇప్పుడు అధికార దశ పూర్తయి తిరిగి ఎన్నికలకు సంసిద్దమవ్వాల్సిన సమయం దగ్గర పడుతోంది కాబట్టి...రాజకీయ...సామాజిక..ఓటు బ్యాంకు సమీకరణాలు ఆలోచించి...తన మాట తీరు మార్చుకోని ఉండొచ్చని...అలా ఒక కంక్లూజన్ వచ్చి స్థిమితపడ్డారట!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+