తెలంగాణకు ఆస్తులు, మాకు అప్పులా: అశోక్ అసహనం, తెలంగాణవాడివి కదా: దత్తాత్రేయతో హరీష్

అమరావతి/హైదరాబాద్: విభజన తీరు సరిగా లేదని, కాంగ్రెస్ పార్టీ విభజన వల్ల ఏపీకి అప్పులు, తెలంగాణకు ఆస్తులు వచ్చాయని కేంద్రమంత్రి, టిడిపి నేత అశోక్ గజపతి రాజు ఆదివారం నాడు అసహనం వ్యక్తం చేశారు. యూపీఏ హయాంలో పార్లమెంటు, శాసనసభల్లో చర్చించకుండానే విభజించిన కాంగ్రెస్‌ ఏపీకి అప్పులు మిగిల్చిందన్నారు.

రాష్ట్రాన్ని ముక్కలు చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి భవిష్యతలో పుట్టగతులుండవన్నారుత. విభజన అనంతరం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమైనప్పటికీ, మిత్రపక్షమైన బిజెపి దానికి దీటుగా ప్యాకేజీ ఇచ్చిందన్నారు. నష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆర్థికంగా గట్టెక్కించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు.

Ashok Gajapathi Raju

దేవినేని ఉమకు చెప్పండి: దత్తాత్రేయతో హరీష్ రావు

కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు న్యాయం జరిగేలా చూడాలని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను తెలంగాణ మంత్రి మంత్రి హరీశ్‌రావు ఆదివారంకోరారు. తెలంగాణ వ్యక్తిగా, ఇక్క డి ప్రజల ప్రయోజనాలను పరిరక్షించేందుకు చొరవ చూపాలన్నారు.

కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అపెక్స్‌ కౌన్సిల్‌ చైర్మన, కేంద్ర జల వనరుల మంత్రి ఉమా భారతికి వివరించాలని విజ్ఞప్తి చేశారు. కృ ష్ణా, గోదావరి జల వివాదాలపై ఈ నెల 21న ఢిల్లీలో అపెక్స్‌ కౌన్సెల్ సమావేశం జరగనున్న నేపథ్యంలో హరీశ్ రావు ఆదివారం దత్తాత్రేయతో భేటీ అయ్యారు.

పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ తరలించుకుపోతున్న కృష్ణా జలాల గురించి హరీశ్‌ వివరించారు. శ్రీశైలం ఎగువ ప్రాంతం నుంచి నీటిని తరలించుకుపోతున్నందున దిగువనున్న నాగార్జునసాగర్‌కు నీరు రావడం లేదని, ఎడమ గట్టు కాలువ ద్వారా సాగునీటిని అందుకోలేకపోతున్నామన్నారు.

జలాలను తరలించుకుపోవడాన్ని అరికట్టాలంటే ప్రాజెక్టులపై రెండు రాష్ట్రాలకు సంయుక్త అజమాయిషీ ఉండేలా కేంద్రాన్ని ఒప్పించాలని కోరారు. ప్రాజెక్టుల వద్ద టెలిమెట్రీ యంత్రాల ఏర్పాటుకు చొరవ చూపాలన్నారు. తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులపై ఏపీ వాదనల్లో వాస్తవం లేదన్నారు. ష్ణా జలాల్లో రావాల్సిన వాటా మేరకే పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను చేపడుతున్నామన్నారు. ఇవి కొత్త ప్రాజెక్టులు కాదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+