రాజీనామాపై మీడియాకు అశోక్ గజపతిరాజు షాక్: ఇలా అన్నారేంటి?
Recommended Video

న్యూఢిల్లీ: ఓపక్క టీడీపీ కేంద్రమంత్రులు ఎన్డీయే నుంచి తప్పుకుంటారని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. మరోవైపు ఇదే విషయాన్ని టీడీపీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు వద్ద ప్రస్తావిస్తే.. ఆయన మాత్రం 'సిల్లీ' అంటూ తీసిపారేశారు.
గురువారం ఉదయం అశోక్ గజపతిరాజు పార్లమెంటుకు వచ్చిన సందర్భంగా.. కేంద్రమంత్రి పదవి నుంచి మీరు తప్పుకుంటున్నారా? అంటూ కొంతమంది జర్నలిస్టులు ఆయన్ను ప్రశ్నించారు. వెంటనే 'వాట్ సిల్లీ క్వశ్చన్?' అంటూ ఫక్కున నవ్వేసి వెళ్లిపోయారు అశోక్ గజపతిరాజు.

కేంద్రమంత్రులు రాజీనామాలు చేస్తారని చంద్రబాబు చెబుతుంటే.. అశోక్ గజపతిరాజు నుంచి ఇలాంటి సమాధానం రావడం మీడియాను ఆశ్చర్య పరిచింది.
రాజీనామా చేస్తాం: సుజనా చౌదరి
అశోక్ గజపతిరాజు సంగతి పక్కనపెడితే.. సుజనా చౌదరి మాత్రం ఆయనకు భిన్నంగా స్పందించారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర మాట తప్పినందున తాము రాజీనామాలు చేస్తామని, ప్రధానిని కలిసి తమ రాజీనామా లేఖలు ఇస్తామని అన్నారు. ప్యాకేజీ అమలులో జాప్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు.












Click it and Unblock the Notifications