సుజనా, ఆశోక్ గజపతిరాజుల రాజీనామాల ఆమోదం
Recommended Video

అమరావతి: కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, ఆశోక్ గజపతిరాజుల రాజీనామాలకు గురువారం రాత్రి ఆమోదం లభించింది. రాష్ట్రంలో మంత్రి పదవులకు కూడ ఆమోదం లభించింది.
కేంద్ర ప్రభుత్వం నుండి వైదొలగాలని టిడిపి నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు గురువారం సాయంత్రం మంత్రులు సుజనా చౌదరి, ఆశోక్ గజపతి రాజులు మంత్రి పదవులకు రాజీనామాలు సమర్పించారు. ఈ రాజీనామాలకు కొద్దిసేపటి క్రితమే ఆమోదం లభించింది.ఈ మేరకు టిడిపి నేతలకు సమాచారం వచ్చింది.

మరో వైపు ఏపీ రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వంలో ఇద్దరు బిజెపి ఎమ్మెల్యేలు మంత్రులుగా కొనసాగారు. కామినేని శ్రీనివాసరావు. మాణిక్యాలరావు కూడ రాజీనామాలను చంద్రబాబునాయుడుకు గురువారం ఉదయం సమర్పించారు.
ప్రధానమంత్రికి రాజీనామాలు సమర్పించిన తర్వాత కొద్దిసేపట్లోనే తమ రాజీనామాలకు ఆమోదం లభిస్తోందని సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు. సుజనా చౌదరి అభిప్రాయం మేరకే కొద్ది గంటల్లోనే ఈ రాజీనామాలకు ఆమోదం లభించింది.
కేంద్ర మంత్రి పదవులకు రాజీనామాలకు ఆమోదం లభించిన కొద్దిసేపట్లోనే బిజెపి మంత్రుల రాజీనామాలకు ఆమోదం లభించినట్టుగా గవర్నర్ కార్యాలయం నుండి చంద్రబాబునాయుడు కార్యాలయానికి సమాచారం వచ్చింది.












Click it and Unblock the Notifications