• search
  • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తిరుమలపై కేంద్రం గిల్లికజ్జాలు! అసలేం జరిగింది, పురావస్తుశాఖ తీసుకుంటే ఏమవుతుంది?

By Srinivas
|

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం, దాని పరిధిలోని దేవాలయాలను రక్షిత కట్టడాలుగా ప్రకటించి పరిరక్షించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించండి అంటూ భారత పురావస్తు శాఖ విజయవాడలోని తన విభాగం ద్వారా శుక్రవారం టీటీడీకి పంపిన లేఖ కలకలం రేపిన విషయం తెలిసిందే.

ఏడేళ్ల క్రితమే అంటే 2011లోనే ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇప్పుడు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌కు పురావస్తు శాఖ నుంచి లేఖ వచ్చింది. శ్రీవారి ఆలయాన్ని చారిత్రక కట్టడంగా ప్రకటించే అంశంపై కేంద్రపురావస్తు లేఖ రాసిందని, కేంద్రం గిల్లి కజ్జాలకు దిగుతోందనే దుమరం చెలరేగింది. పెద్ద ఎత్తున ఆందోళనలు కనిపించాయి. ఆ తర్వాత దీనిపై స్పష్టత వచ్చింది.

టీటీడీకి మరో లేఖ

టీటీడీకి మరో లేఖ

ఈఓ అనిల్ కుమార్‌ సింఘాల్‌ కేంద్ర పురావస్తు శాఖ డైరెక్టర్‌ జనరల్‌తో మాట్లాడారు. దీనిపై వివరణ ఇచ్చారు. ఆ తర్వాత టీటీడీకి మరో లేఖ వచ్చింది. గతంలో రాసిన లేఖను ఉపసంహరించుకుంటున్నామని, దాన్ని రద్దయినట్టుగా భావించాలంటూ పేర్కొన్నారు. దీంతో వివాదం ఆగిపోయింది.

అక్కడితో వివాదం కాస్త సద్దుమణిగింది. మరోవైపు, టీటీడీ ఆలయాలతో పాటు మరే ఇతర ఆలయాలు, మసీదులను తమ స్వాధీనంలోకి తీసుకునే ఆలోచన కేంద్రానికి లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు పేర్కొన్నారు.

జీవీఎల్ నర్సింహా రావు వివరణ

జీవీఎల్ నర్సింహా రావు వివరణ

కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి తనతో ఈ విషయం చెప్పారని, రాష్ట్ర ప్రభుత్వాలు కోరినప్పుడు మాత్రమే కేంద్రం అలాంటి ప్రతిపాదనను పరిశీలిస్తుందని కూడా జీవీఎల్ నర్సింహా రావు తెలిపారు. దుష్ప్రచారం వద్దన్నారు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాలో 3686 కట్టడాలున్నాయని, ఆ జాబితాలో మరిన్ని చేర్చే ఆసక్తి లేదని సాంస్కృతిక, పురావస్తు మంత్రిత్వ శాఖ అనుమతి లేకుండానే విజయవాడలోని ఏఎస్‌ఐ అధికారి టీటీడీ ఈఓకి లేఖ రాశారని, బాధ్యతారాహిత్యంతో వ్యవహరించిన ఆ అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవలసిందిగా ఆ శాఖ మంత్రి మహేశ్‌శర్మను కోరామని జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు.

వివాదానికి కారణం ఇదీ

వివాదానికి కారణం ఇదీ

విజయవాడలోని ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అమరావతి సర్కిల్‌ కార్యాలయం సూపరింటెండింగ్‌ ఆర్కియాలజిస్ట్‌ టి.శ్రీలక్ష్మి శుక్రవారం టీటీడీకి ఈఓకి ఒక లేఖ రాశారు. శ్రీవారి ఆలయాలు, వాటి సంబంధ ఆలయాలను చారిత్రక ప్రాశస్తక కట్టడాలుగా ప్రకటించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నుంచి సమాచారం వచ్చిందని తెలిపారు. దీంతో దుమారం ప్రారంభమైంది.

అప్పుడు గతంలోను

అప్పుడు గతంలోను

శ్రీవారి ఆలయాన్ని ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా పరిధిలోకి తీసుకోవాలని ఐవైఆర్ కృష్ణారావు టీటీడీ ఈవోగా ఉన్న సాంస్కృతిక, పురావస్తు శాఖకు ఓ లేఖ పంపించారు. దానిపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. దీంతో ఉపసంహరించుకున్నారు.

పురావస్తు శాఖకు ఇస్తే ఏమవుతుంది?

పురావస్తు శాఖకు ఇస్తే ఏమవుతుంది?

తిరుపతి సమీపంలో శ్రీనివాస మంగాపురం ఆలయం ఉంది. ఈ ఆపయాన్ని పురావస్తు శాఖకు అప్పగించారు. ఆలయాల వంటి వాటిని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తమ ఆధీనంలోకి తీసుకుంటే కట్టడం బాగోగులు, రక్షణ మాత్రమే చూసుకుంటుంది. ఆలయాల్లో జరిగే నిత్య పూజా విధులు, ఉత్సవాలు, ఆదాయ వ్యయాలు వంటి అంశాల్లో జోక్యం చేసుకోంది. స్థానిక ప్రభుత్వాలుగానీ, పాలకమండళ్లు గానీ తమంతట తాము నిర్ణయాలు తీసుకుని వారసత్వ కట్టడాలను తొలగించేందుకు, కూలగొట్టేందుకు, మార్పులు చేర్పులు చేసేందుకు, కట్టడాల్ని పెంచడం, తగ్గించడం వంటివి చేసేందుకు అవకాశం ఉండదు. ప్రహరీ నుంచి వంద మీటర్ల వరకు నిషిద్ధ ప్రాంతంగా ప్రకటిస్తారు.200 మీటర్ల వరకు నియంత్రిత ప్రాంతంగా ప్రకటిస్తారు.

తిరుమలను ఆధీనంలోకి తీసుకుంటే

తిరుమలను ఆధీనంలోకి తీసుకుంటే

తిరుపతి ప్రపంచంలోనే ప్రముఖ దేవాలయం. హిందూ సనాదన ధర్మానికి అనుగుణంగా పూజలు జరుగుతాయి. వేలాది మంది రోజుకు దర్శించుకుంటారు. ఎక్కువమంది దర్శనానికి టీటీడీ ఇప్పుడు చర్యలు చేపడుతోంది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలోకి వెళ్తే పూజా విధుల్లోను, నిర్వహణ వ్యవహారాల్లోను పురావస్తుశాఖ జోక్యం చేసుకోకపోయినా, ఆలయానికి సంబంధించినంత వరకు చిన్న చిన్న మార్పులు చేర్పులు, నిర్మాణాలు చేయాలన్నా కుదరదని అంటున్నారు.

ఇలా వివాదానికి ముగింపు

ఇలా వివాదానికి ముగింపు

పురావస్తు శాఖ నుంచి వచ్చిన లేఖపో తాను సంబంధి డీజీతో మాట్లాడానని, తమ ప్రమేయం లేకుండానే లేఖ వచ్చిందని, కొందరు అధికారుల వల్లే అలా జరిగిందని పేర్కొన్నారు. లేఖను రద్దు చేస్తున్నట్లు తెలిపారని చెప్పారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Archaeological Survey of India today withdrew a controversial letter it wrote to the Executive Officer of Tirumala Tirupati Devasthanams managing the famous Lord Venkateswara shrine, on the feasibility of declaring it and other sub-temples as protected monuements.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more