Asia Cup 2025: లైవ్ లేకపోతే మళ్లీ ఆ ఘోరం ..! పాక్ పై సాయిరెడ్డి పంచ్ లు..!

నిన్న దుబాయ్ లో జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. తద్వారా పాకిస్తాన్ పై రికార్డును మరింత మెరుగుపర్చుకుంది. అంతే కాదు ఈ టోర్నీలో వరుసగా మూడోసారి పాకిస్తాన్ ను ఓడించి అంతర్జాతీయ టోర్నీల్లో తమ సత్తా చాటుకుంది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. అదే సమయంలో పాకిస్తాన్ పై పంచ్ లు పేలుతున్నాయి. రాజకీయ నేతలు, మాజీ క్రికెటర్లు తమదైన శైలిలో పాక్ కు చురకలు అంటిస్తున్నారు.

ఈ నేపథ్యంలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా భారత్-పాక్ ఫైనల్ మ్యాచ్ పై స్పందించారు. ఓవైపు ఆసియాకప్ టోర్నీ టైటిల్ గెల్చిన టీమిండియా క్రికెటర్లకు శుభాకాంక్షలు తెలుపుతూనే.. మరోవైపు పాకిస్తాన్ పై పంచ్ లు పేల్చారు. ముఖ్యంగా నిన్నటి ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కాకుండా ఉంటే ఏం జరిగేదో సాయిరెడ్డి వివరించారు. గతంలో పాకిస్తాన్ ఆడిన ఓ అబద్ధానికి దాన్ని సాయిరెడ్డి లింక్ చేశారు.

Asia Cup 2025 Vijayasai Reddy Thanks Live Telecast Says It Thwarted Pakistan s Win Claim

ఆసియాకప్ ఫైనల్ పై సాయిరెడ్డి ఇవాళ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన.. ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం జరిగినందుకు ముందుగా దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలన్నారు. లేకుంటే పాకిస్తాన్ మ్యాచ్ గెలిచినట్లు చెప్పుకునేదన్నారు. టోర్నమెంట్ అంతటా మన తెలుగు ఆటగాడు తిలక్ వర్మ మరియు అభిషేక్ శర్మ అద్భుతమైన ప్రదర్శనలతో ఆసియా కప్ గెలిచినందుకు జట్టుకు సాయిరెడ్డి అభినందనలు తెలిపారు.

Asia Cup 2025 Vijayasai Reddy Thanks Live Telecast Says It Thwarted Pakistan s Win Claim

గతంలో ఆపరేషన్ సింధూర్ జరిగిన సమయంలో ఇలాగే భారత్ పాకిస్తాన్ కు చెందిన యుద్ధ విమానాలతో పాటు రక్షణ వ్యవస్థలను కూడా కూల్చింది. అయితే చివరికి కాల్పుల విరమణ తర్వాత మాత్రం పాకిస్తాన్ ఈ యుద్ధంలో గెలిచినట్లు తమ దేశంలో చెప్పుకుంది. ఎందుకంటే యుద్ద రంగంలో జరిగే ప్రతీ దాడికీ కచ్చితమైన సాక్ష్యాలు ఉండే అవకాశాలు లేవు. అయినా భారత్ మాత్రం తాము పాకిస్తాన్ కు చేసిన నష్టాల్ని దాదాపుగా టెక్నాలజీ సాయంతో బయటపెట్టింది. ఇప్పుడు దాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ సాయిరెడ్డి ఈ ట్వీట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+