ఇప్పటి దాకా కుదరలేదు, బడ్జెట్ సమావేశాలు ఎపిలోనే: కోడెల

న్యూఢిల్లీ/ ఏలూరు: పరిపాలన ఏపీ నుండి కొనసాగుతున్నందున.. అసెంబ్లీ, కౌన్సిల్‌ సమావేశాలు ఏపీలో పెట్టాలని ప్రయత్నించినా కుదరలేదని స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావు అన్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నిర్వహిస్తామని ఆయన చెప్పారు.

మంగళవారం ఆయన ఢిల్లీలో కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, సురేష్‌ప్రభును కలిసి నర్సరావుపేట 100 సంవత్సరాల వేడుకలకు ఆహ్వానించారు. డిసెంబర్ 11,12,13 మూడు రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చట్టసభలో ప్రజా సమస్యలపై చర్చలు జరిగితేనే ప్రజలకు ఉపయెగకరమని, వచ్చే అసెంబ్లీ సమావేశాలు చాలా కీలకమైనవని స్పీకర్‌ చెప్పారు.

Kodela Siva Prasad

జనవరి 1 నుంచి ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని, ఒక్కో ఇంటికి 2.75 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి డిసెంబర్‌ 1 నుంచి జనచైతన్య యాత్రలు ప్రారంభిస్తున్నామన్నారు.

మంగళవారం పార్టీ జిల్లా కార్యలయంలో జరిగిన జిల్లా కమిటీ సమన్వయ సమావేశానికి ఇన్‌చార్జ్‌ మంత్రిగా అయ్యన్న పాత్రుడు హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+