చొక్కా పట్టుకుంటారా: గాదె, చింతిస్తున్నాం: ఈటెల

ద్రోణంరాజు అభ్యంతరాలపై తెరాస సభ్యులు తీవ్రంగా ప్రతిస్పందించారు. సమైక్య నినాదాలతో సీమాంధ్ర సభ్యులు, తెలంగాణ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. దౌర్జన్యం చేస్తే అడ్డుకునే శక్తిసామర్థ్యాలు తమకు ఉన్నాయని ఆయన అన్నారు. విద్యాసాగర్‌పై కఠినమైన చర్య తీసుకోవాలని తెలుగుదేశం సభ్యుడు బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి కోరారు. దీన్ని సమైక్యవాదులపై దాడిగా పరిగణిస్తున్నట్లు ఆయన తెలిపారు.
సీమాంధ్ర సభ్యులను మంత్రి శైలజానాథ్, తమ పార్టీ సభ్యులను హరీష్ రావు సముదాయించి స్పీకర్ పోడియం నుంచి వెనక్కి రప్పించారు. సంఘటనకు తాము చింతిస్తున్నామని ఈటెల రాజేందర్ చెప్పినా సీమాంధ్ర సభ్యులు వినిపించుకోలేదు. ఈటెల రాజేందర్ తప్పు దోవ పట్టించే విధంగా మాట్లాడితే ద్రోణంరాజు శ్రీనివాస్ పద్ధతి కాదని అన్నారని, దానికే సభ్యతా సంస్కారమూ లేకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరించరాని గాదె వెంకటరెడ్డి అన్నారు. విద్యాసాగర్ క్షమాపణ చెప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. తెరాస సభ్యులను నియంత్రించాల్సిన బాధ్యత ఈటెల, హరీష్ రావులదేనని ఆయన అన్నారు. తాము తెలివి తక్కువవాళ్లం కాదని ఆయన అన్నారు.
ఒకరిని ఇబ్బంది పెట్టనని తాను చెప్పానని, అందుకు కట్టుబడి ఉంటానని, సభ్యుల హుందాతనానికి ఇది సరిపోదని ఆయన అననారు. తనను అడ్డుకునే ప్రయత్నం చేయవద్దని ఆయన అన్నారు. సీమాంధ్ర సభ్యుల వాదనలో పస లేదు కాబట్టే ఇలాగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. తమ వారిని బెదిరించడం సరికాదని మంత్రి శైలజానాథ్ అన్నారు. ఏమైనా అభ్యంతరాలుంటే స్పీకర్‌కు చెప్పాలని ఆయన చెప్పారు. సభ్యులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత స్పీకర్‌దేనని ఆయన అన్నారు.
విశాలాంధ్ర ఏర్పాటుకు సహకరించిన బూర్గుల రామకృష్ణారావు మరణిస్తే అధికార లాంఛనాలతో అంతక్రియలు చేయలేదని, అది సీమాంధ్ర పాలకుల సంస్కారమని, ఇక ఏం మాట్లాడుతామని ఆయన అన్నారు. తెలంగాణవాళ్లకు మనోభావాలున్నట్లే తమకు కూడా మనోభావాలున్నాయని, తాము కూడా తమ ప్రజల మనోభావాలను వినిపించాల్సిన అవసరం తమకు ఉందని తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి అన్నారు. పొట్టి శ్రీరాములు సంఘటనను వక్రీకరించారని ఆయన అన్నారు. చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆయన విమర్శించారు. తెరాస సభ్యుల ప్రవర్తనను సభ ఖండించాల్సిందేనని ఆయన అన్నారు.
ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది 1952లో అని చెప్పామని, ఇందులో తప్పేముందని ఈటెల రాజేందర్ అన్నారు. ఆ తర్వాత ఈటెల రాజేందర్ తన చర్చను కొనసాగించారు. సమైక్య రాష్ట్రంలో జారీ అయిన జీవోలు చిత్తు కాగితాల మాదిరిగా మారిపోయాయని ఆయన అన్నారు. 50 వేలకు పైగా ఉద్యోగాలను అక్రమంగా కొల్లగొట్టారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications