స్పీకర్ కీలక ప్రకటన - జగన్ అనూహ్య నిర్ణయం..!!

ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు అవుతోంది. ఇదే సమయంలో ఎన్నికల్లో పరాజయం పాలైన వైసీపీ తిరిగి బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పార్టీ నియామకాలు పూర్తి చేసి.. జిల్లాల పర్యటనలు ప్రారంభించాలని జగన్ భావిస్తున్నారు. ఇక.. తాడేపల్లిలో ప్రజలు - పార్టీ శ్రేణులను కలిసేందుకు నిర్ణయించారు.ఈ మేరకు జగన్ నివాసం వద్ద ఏర్పాట్లు చేసారు. ఇదే సమయంలో జగన్ అసెంబ్లీకి గైర్హాజరు వేళ స్పీకర్ అయ్యన్న కీలక అంశాలను వెల్లడించారు.

అసెంబ్లీకి దూరంగా వైసీపీ
2024 ఎన్నికల్లో 11 సీట్లు గెలిచిన వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. కూటమిలో ఉన్న మూడు పార్టీలు ప్రభుత్వంలో ఉండటంతో.. ప్రతిపక్షంగా తమ పార్టీని గుర్తించాలని జగన్ డిమాండ్ చేస్తు న్నారు. ఇదే డిమాండ్ పైన న్యాయ పోరాటం ప్రారంభించారు. కూటమి నేతలు మాత్రం వైసీపీకి ప్రతిపక్ష హోదా సాధ్యం కాదని తేల్చి చెబుతున్నారు. జగన్ మాత్రం తన వాదనకే కట్టుబడి ఉన్నారు. జగన్ తో పాటుగా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి గైర్హాజరు పైన రాజకీయంగా విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యేగా ప్రమాణం, బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్ ప్రసంగానికి జగన్ హాజరయ్యారు. ఆ తరువాత సభకు దూరంగా ఉంటున్నారు.

Assembly speaker Ayyanna patrudu says YS Jagan not taking salary as MLA

అయ్యన్న వ్యాఖ్యలు
తాజాగా అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక అంశాలను ప్రస్తావించారు. సభలో కొంత మంది సభ్యులు అసెంబ్లీకి వచ్చి హాజరుపట్టికలో సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని తెలిపారు. వీరిలో ముఖ్యంగా వై.బాలనాగిరెడ్డి (మంత్రాలయం), తాటిపర్తి చంద్రశేఖర్‌ (యర్రగొండపాలెం), వేగం మత్స్యలింగం (అరకు), బి.విరూపాక్షి (ఆలూరు) విశ్వేశ్వరరాజు(పాడేరు), అమరనాథ్‌రెడ్డి (రాజంపేట), దాసరి సుధ (బద్వేలు) ఉన్నారని.. వేర్ వేరు తేదీల్లో హాజరుపట్టికలో వారు సంతకా లు చేసిన ట్లు తన దృష్టికి వచ్చిందని స్పీకర్ చెప్పుకుచ్చారు. దీనికి స్పందనగా ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటూ సభకు రాకుండా సంతకాలు పెట్టడంపై ఎథిక్స్‌ కమిటీ కి నివేదించాలని జనసేన సభ్యుడు కొణతాల సూచించారు.

జీతం తీసుకోని జగన్
అదే సమయంలో స్పీకర్ అయ్యన్న జీతాల అంశాన్ని ప్రస్తావించారు. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మిన‌హా, మిగిలిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండానే జీతాలు తీసుకుంటున్న‌ట్టు స్పక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు చెప్పారు. గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. దీంతో ఈ విషయం పైన వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ స్పందించారు. అసెంబ్లీకి హాజరు కాని కాలానికి జీతాల విషయంలో ఇప్పుడు వైసీపీ సభ్యుల్లో చర్చ జరుగుతోంది. జగన్ తరహాలోనే పార్టీ ఎమ్మెల్యేలు జీతం తీసుకోకుడదనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ అధినేత తో చర్చించిన తరువాత అధికారికంగా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+