నాగరాజు హత్యకు మలేషియా నుంచే కుట్ర

హైదరాబాద్: జ్యోతిష్యుడు నాగరాజు హత్యాయత్నానికి మలేషియా నుంచే కుట్ర జరిగిందని సైబరాబాద్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఏప్రిల్ 1న సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జింకల బావి ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల ఘటనలో గాయపడ్డ నాగరాజు కుమారుడు శివకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.

విచారణలో భాగంగా నాగరాజు, అతని కుటుంబ సభ్యులు, ప్రత్యర్థి భూతం గోవిందు, భూతం శ్రీనివాస్ అనుచరులు, బంధువుల నుంచి సేకరించిన వివరాల ప్రకారం ఈ హత్యాయత్నానికి మలేసియాలోని కౌలాలంపూర్‌లో పథకం వేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. మొదట భూతం శ్రీనివాస్ లండన్‌లో ఉన్నట్లు భావించినప్పటికీ పోలీసులకు లభించిన సమాచారం మేరకు అతను కౌలాలంపూర్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

Astrologer nagaraj murder plan from malaysia

భూతం శ్రీనివాస్ అక్కడి నుంచి ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన కొంత మందిని సుపారీపై మాట్లాడుకుని సంఘటనకు ముందు నెల రోజులుగా పథకం రచించాడని సైబరాబాద్ పోలీసులకు కొన్ని ఆధారాలు లభించాయి. అయితే నాగరాజు మామ నాగేశ్వరరావు, బావమరుదులు గంధం మారయ్య, పగిడి మారయ్యను హత్య చేసిన కిరాయి హంతక ముఠా లీడర్ ద్వారానే నాగరాజు హత్యకు కూడా ప్లాన్ చేశారని పోలీసు అధికారులు భావిస్తున్నారు.

భూతం దుర్గరావుతో పాటు, నాగరాజు బంధువుల హత్య కేసుల్లో ఉన్న నిందితులు, అనుమానితుల వివరాలను పోలీసులు ఇప్పటికే సేకరించారు. ఈ నేపథ్యంలోనే నాగరాజును మట్టుబెట్టేందుకు ఏప్రిల్ 6న ఎందుకు ప్రత్యేకంగా పెట్టుకున్నారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. క్రైం సీన్ పరిశీలన, సంఘటన స్థలంలో లభించిన బుల్లెట్ షెల్స్, సీసీ కెమెరాల ఫుటేజ్ లతో పలు సాక్ష్యాలు సేకరించిన పోలీసులు, ఆ రోజు టార్గెట్‌ను అమలు చేసేందుకు మొత్తం ఐదుగురు వచ్చారని అనుమానిస్తున్నారు.

వారిలో ఇద్దరు షార్ప్ షూటర్స్, మరో ముగ్గురు స్థానికులు ఉన్నట్లు తెలుస్తోంది. వారు నాగరాజు వివరాలు సేకరించడం అతని కదలికలను పసిగట్టడంతో పాటు షూటర్స్‌కు టార్గెట్‌ను చూపించడంతో పాటు ఎస్కెప్‌కు సహకరించారని సమాచారం. ఈ దశలో దర్యాప్తు చేసిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే నిందితులు దొరికే వరకు ఈ కేసులో ఎలాంటి స్పష్టత ఇవ్వలేమని సైబరాబాద్ పోలీసుల అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+