2024 లో పవన్ కల్యాణ్ విడాకులు తీసుకుంటారు: వేణుస్వామి

ప్రస్తుతం రాజకీయ రంగంతోపాటు సినీ రంగంలోని సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన జాతకాలను బహిరంగంగా చెబుతూ తాను కూడా చివరకు ఓ సెలబ్రిటీలా మారిపోయారు వేణుస్వామి. వాస్తవానికి ఈయన చెప్పినవాటిల్లో చెప్పినవి చెప్పినట్లుగా జరుగుతున్నవి ఏమైనా ఉన్నాయా? అంటే సమాధానం చెప్పడం కూడా కష్టం. సినీ రంగంలో పెళ్లిచేసుకున్న నాగచైతన్య-సమంత ఎక్కువకాలం కలిసి జీవించరని, వారు విడాకులు తీసుకుంటారని చెప్పారు. అది మాత్రం నిజమైంది.

కేసీఆర్ తెలంగాణకు మరోసారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. అది జరగలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తర్వాత ప్రభాస్ మీద పడ్డాడు. ఆయన చెప్పినట్లు బాహుబలి2 తర్వాత వరుసగా సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ఫ్లాపవుతాయని, ఆయనతో సినిమా తీసే నిర్మాతలు జాతకాలు చూపించుకోవాలని చెప్పారు. సలార్ విషయంలో కూడా అదేచెప్పారు. అయితే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతోపాటు దాదాపు రూ.650 కోట్ల వసూళ్లు సాధిస్తోంది. దీనికి మీ సమాధానం ఏమిటని వేణుస్వామిని అడిగితే నాలుగు సినిమాలు విడుదలైతే అందులో సలార్ ఒక్కటే హిట్ అవడం.. అది కూడా హిట్టా? అంటూ ఆయన కవర్ చేసుకుంటూ వస్తున్నారు.

astrologer venu swamy comments on pawan kalyan divorce issue

తాజాగా విడుదల చేసిన వీడియోలో వేణుస్వామి పవన్ కల్యాణ్ గురించి మాట్లాడారు. ఆయన మళ్లీ విడాకులు తీసుకుంటారని చెప్పి అందరినీ షాక్ కు గురిచేశారు. సినిమాల పరంగా మంచి భవిష్యత్తు ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కాంట్రవర్సీకి గురవుతారని, వాటన్నింటిని ఎదుర్కోక తప్పదన్నారు. ఆయనకు చెప్పేవారు లేక అనవసరంగా రాజకీయాలు చేస్తూ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. 2024లో మూడోసారి విడాకులు తీసుకుంటారన్నారు. ఆయన కేవలం త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట వింటారని, కానీ త్రివిక్రమ్ పవన్ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోరన్నారు. పవన్ కల్యాణ్ ఇకనైనా మేలుకోవాలని, ఏంచేస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతారు? అనే విషయాన్ని గుర్తించాన్నారు. పవన్ ముఖ్యమంత్రి అయితే చూడాలనుకుంటున్నవారిలో తాను కూడా ఉన్నానని, అది అర్థం చేసుకోకుండా పవన్ అభిమానులను తనను అనవసరంగా ట్రోల్ చేస్తున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+