చంద్రబాబు అరెస్ట్ పై నిజమైన వేణుస్వామి జోస్యం - జగన్ పై ఇలా..!!
చంద్రబాబు అరెస్ట్ ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో సంచలనం. తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని చంద్రబాబు గత వారం చెప్పారు. కానీ, చంద్రబాబు అరెస్ట్ గురించి ప్రఖ్యాత జ్యోతిష్కులు వేణు స్వామి రెండేళ్ల క్రితమే చెప్పారు. 2023 లో చంద్రబాబు న్యాయ పరమైన....ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ కావటంతో..ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇదే సమయంలో కేసీఆర్..జగన్ గురించి ఆసక్తి కర అంశాలు వేణుస్వామి వెల్లడించారు.
వేణుస్వామి అంచనాలు
రాజకీయ నేతలు..సినీ సెలబ్రెటీల గురించి వేణుస్వామి చెప్పే అంచనాలు నిజం అవుతాయనే అభిప్రాయం ఉంది. 2021లో ఇక ఇంటర్వ్యూలో వేణుస్వామి చంద్రబాబు గురించి చేసిన అంచనాలు ఇప్పుడు నిజం అయ్యాయి. ఆ ఇంటర్వ్యూలో 2023 జనవరిలో మారిన గ్రహ ప్రభావంతో రాజకీయాలు మారుతాయని వేణు స్వామి చెప్పారు. దేశంలోని ప్రముఖ రాజకీయ నేతల పరిస్థితుల్లో మార్పు వస్తుందని చెప్పుకొచ్చారు. కేసీఆర్ జాతకంలో 2023లో అష్టమ శని ప్రారంభం అవుతుందని నాడు వేణు స్వామి చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబుది సైతం పుష్యమి నక్షత్రం..కర్కాటక రాశిగా పేర్కొన్నారు. దీని కారణంగా చంద్రబాబు, కేసీఆర్ కు ఆరోగ్య..న్యాయ పరంగా సమస్యలు ఉంటాయనేది తన అంచనాగా పేర్కొన్నారు.

జగన్ కు కలిసి వస్తుందని
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాజిటివ్ కు వెళ్తున్నారని చెప్పారు. ఆయన నెగటివ్ ఉన్నప్పుడే ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. 2020 నుంచి జగన్ కు 2023 వరకు బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పుకొచ్చారు. 2023 నుంచి ఆయనకు శని వెళ్లిపోతుందన్నారు. కేసీఆర్, చంద్రబాబుకు శని ప్రవేశిస్తున్నాడని గ్రహ స్థితి గతులను విశ్లేషించారు. మోదీకి శని..అమిత్ షాకు రాహువు వస్తున్నాడని వివరించారు. రాజకీయాల్లో సంచలనాలు చూస్తామని అంచనా వేసారు. పెను సంచలనాలతో పాటుగా కుదుపు రాజకీయాల్లో చూస్తామని ఆ ఇంటర్వ్యూలో వేణు స్వామి వెల్లడించారు. కన్యా రాశి వారికి 2023 లో రాజ యోగం మొదలు అవుతుందని..పదేళ్ల పాటు వారికి తిరుగు ఉండదన్నారు. మిధున, సింహ, తులా రాశుల వారికి బాగుంటుందని వివరించారు.
రాజకీయాలపై ఆసక్తికరంగా
మూడు నెలల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూల్లోనూ వేణుస్వామి ఏపీ రాజకీయాల గురించి ఆసక్తి కర అంచనాలను వెల్లడించారు. 2024 ఎన్నికల్లో జగన్ కు మరోసారి అధికార యోగం ఉందని చెప్పుకొచ్చారు. అదే సమయంలో చంద్రబాబు - పవన్ మధ్య పొత్తు విషయంలోనూ చివరి నిమిషంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయని పేర్కొన్నారు. ఇప్పుడు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఏనాడు రిమాండ్ ఎదుర్కోని చంద్రబాబు అరెస్ట్ కావటం..రాజమండ్రి జైలుకు వెళ్లటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారింది.












Click it and Unblock the Notifications