చంద్రబాబు ఓటమిని అంగీకరించలేకనే ప్రాణం లేని ఈవీఎంలపై ఆరోపణలు : జీవీఎల్
వీవీ ప్యాట్ స్లిప్ల్‌లను యాబై శాతం కాదు, వంద శాతం స్లిప్‌లను వందసార్లు లెక్కించినా ఏపి సీఎం చంద్రబాబునాయుడు ఇంటికి పోవడంఖాయమని అన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నర్సింహరావు. తన ఓటమీని అంగీకరించలేకే ప్రాణంలేని వీవీ ప్యాట్‌లపై ఆరోపణలుచేస్తున్నారని ఆయన విమర్శించారు.

ఈనేపథ్యంలోనే అటు మోడీ పైన ఇటు సీఎం కేసీఆర్ పైన విరుచుకుపడుతున్నారని అన్నారు. ఇక గతంలో తాను 2010 లో ఈవీఎం లపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పుస్తకం రాసిన విషయం నిజమేనని అప్పుడున్న పరిస్థితుల్లో తాము అనుమానాలు వ్యక్తం చేశామని ,అయితే 2014 ఎన్నికల్లో వీవీ ప్యాట్ స్లిప్పులు లేవని 2019లో మొత్తం దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈవీఎంలకు వీవీప్యాట్‌లను అమర్చారని చెప్పారు.ఇలాంటీ నేపథ్యంలో ఈవీఎంలపై తమకు ఎలాంటీ అనుమానాలు లేవని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications