వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మద్యం దుకాణాలు పెంచటమే మద్యపాన నిషేధమా? 25 వేల కోట్ల దోపిడీకి జగన్ ప్లాన్ : అచ్చెన్న ధ్వజం

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఏదో ఒక విషయంపై మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఎన్నికలకు ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ పాలనలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంది అంటూ టిడిపి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు జగన్ సర్కార్ పై ధ్వజమెత్తారు.

శవ రాజకీయాలకు జంతువులనూ వదలని చంద్రబాబు .. జగన్ మైనింగ్ మాఫియా పోస్ట్ పై సాయిరెడ్డి పంచ్శవ రాజకీయాలకు జంతువులనూ వదలని చంద్రబాబు .. జగన్ మైనింగ్ మాఫియా పోస్ట్ పై సాయిరెడ్డి పంచ్

 ఏపీలో మద్యం దుకాణం లేని గ్రామం లేదని తీవ్ర ఆగ్రహం

ఏపీలో మద్యం దుకాణం లేని గ్రామం లేదని తీవ్ర ఆగ్రహం

మద్యపాన నిషేధం అంటూ ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి, ఆ హామీలను జగన్ విస్మరించారని మండిపడ్డారు. మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి మద్యం షాపులను పెంచుకుంటూ పోతున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మద్యం దుకాణాలు పెంచటమే మద్యపాన నిషేధమా అని ప్రశ్నించిన అచ్చెన్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం దుకాణం లేని గ్రామం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం మత్తులో మునిగి తేలుతున్న వైసీపీ ప్రభుత్వానికి మహిళలు మత్తు వదిలించడం ఖాయమని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

జోరుగా మద్యం షాపులు ... కొనసాగుతున్న లిక్కర్ విక్రయాలు

జోరుగా మద్యం షాపులు ... కొనసాగుతున్న లిక్కర్ విక్రయాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ గా సీఎం జగన్ మార్చారని, మద్యపాన నిషేధం పేరుతో మద్యానికి రహదారులు వేసి మరీ విక్రయాలు సాగిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల్లో 300 దుకాణాల ఏర్పాటుకు ప్రణాళికలు వేసి అందులో 41 షాపులను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చారని అచ్చెన్నాయుడు విమర్శించారు. వాకిన్ స్టోర్స్ పేరుతో 90 మద్యం మాల్స్ కు అనుమతులు ఇచ్చి ఇప్పటికే 21 మాల్స్ ప్రారంభించారని అసహనం వ్యక్తం చేశారు.

 జగన్ రెడ్డి కమీషన్ల కోసం నాసిరకం బ్రాండ్లు .. 25 వేల కోట్ల దోపిడీ ప్లాన్

జగన్ రెడ్డి కమీషన్ల కోసం నాసిరకం బ్రాండ్లు .. 25 వేల కోట్ల దోపిడీ ప్లాన్

జగన్ రెడ్డి తన కమీషన్ల కోసం నాసిరకం బ్రాండ్లను ఏపీలో విక్రయిస్తున్నారని మండిపడ్డారు అచ్చెన్నాయుడు. 25 వేల కోట్ల అప్పు కోసం భవిష్యత్తులో మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టారని అచ్చెన్న దుయ్యబట్టారు. 25 వేల కోట్ల దోపిడీకి ప్రణాళిక రూపొందించారని, ఏడాదికి ఐదు వేల కోట్ల జె టాక్స్ దండుకుంటూ, ఐదేళ్లలో 25 వేల కోట్ల రూపాయల దోపిడీకి రంగం సిద్ధం చేశారన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టిన సీఎం జగన్ అప్పులు తీర్చడం కోసం మద్యం షాపులు, మద్యం రేట్లు పెంచడం ద్వారా మందు బాబుల రక్తం తాగుతున్నారని విమర్శించారు.

మందుబాబుల రక్తంతో, వాళ్ల కుటుంబాల కన్నీళ్లతో రాష్ట్రం అప్పులు తీరుస్తారా ? అచ్చెన్న ధ్వజం

మందుబాబుల రక్తంతో, వాళ్ల కుటుంబాల కన్నీళ్లతో రాష్ట్రం అప్పులు తీరుస్తారా ? అచ్చెన్న ధ్వజం


మద్యం పై వచ్చే ఆదాయం చూపించి అప్పులు తెస్తున్నారని, అలాంటప్పుడు మద్యనిషేధం అమలు ఎప్పుడు అని ప్రశ్నించారు అచ్చెన్నాయుడు. మందుబాబుల రక్తంతో, వాళ్ల కుటుంబాల కన్నీళ్లతో రాష్ట్రానికి చేసిన అప్పులు తీర్చాలి అని చూస్తున్నారా అని ప్రశ్నించిన అచ్చెన్నాయుడు రాష్ట్రంలో మద్యనిషేధం విషయం మర్చిపోయారని, రాష్ట్రవ్యాప్తంగా మద్యపానం జోరుగా సాగుతుందని, మద్యం ఏరులై ప్రవహిస్తుంది అని జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారు.

English summary
TDP AP state president Kinjarapu Atchannaidu has fired on Jagan govt, saying that alcohol sales is on the rise in the state under the YCP government that came to power promising a complete ban on alcohol before the elections. Asked whether the prohibition of alcohol was the increase in liquor shops ? Atchanna said there was no village in the state of Andhra Pradesh without a liquor store.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X