Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైఎస్ జగన్ ,మంత్రులు గాడిదలు కాస్తున్నారా ? దుర్బుద్ధితోనే వ్యవస్థల నాశనం : అచ్చెన్నాయుడు ధ్వజం

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజధాని అమరావతి విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నారని, అమరావతిని చంపేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగితే జగన్, మంత్రులు గాడిదలు కాస్తున్నారా అని ప్రశ్నించిన అచ్చెన్నాయుడు చంద్రబాబు మీద కోపం తోనే జగన్ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు .

సీఎం జగన్ కు అవగాహన, మానవత్వం రెండూ లేవు

సీఎం జగన్ కు అవగాహన, మానవత్వం రెండూ లేవు

వైజాగ్ లో జగన్ అనుచరులు దోపిడీ చేస్తున్నారని, ఈ దోపిడీ కోసమే రాజధాని అమరావతి నుండి తరలించాలని కుట్ర చేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు . దేశానికి తలమానికంగా రాజధాని అమరావతి నిర్మించాలని చంద్రబాబు ఆలోచించారని పేర్కొన్న అచ్చెన్నాయుడు, అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే అమరావతి రాజధానిగా నిర్ణయించారని గుర్తు చేశారు. చంద్రబాబుపై విశ్వాసం తో రైతులు 34 వేల ఎకరాల భూమిని కూడా ఇచ్చారని పేర్కొన్నారు. సీఎం జగన్ కు అవగాహన లేదని, కనీసం మానవత్వం కూడా లేదని అచ్చెన్నాయుడు మండిపడ్డారు .

చంద్రబాబు మీద కోపంతోనే దుర్బుద్ధి

చంద్రబాబు మీద కోపంతోనే దుర్బుద్ధి

కేవలం చంద్రబాబు మీద కోపంతో రాజధాని అమరావతిని నాశనం చేస్తున్నారని, దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు అచ్చెన్నాయుడు. రాజధాని అమరావతి నిర్మించిన క్రెడిట్ చంద్రబాబుకు దక్కుతుందని భయంతో, 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారని, సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని అచ్చెన్నాయుడు తప్పుబట్టారు. మూడు రాజధానులు ఎవరు కోరుకోలేదని పేర్కొన్న అచ్చెన్నాయుడు, అమరావతి రైతు ఉద్యమం ప్రజా ఉద్యమం అని స్పష్టం చేశారు.

 ఉపాధ్యాయ బదిలీల్లో రాజకీయం సిగ్గుచేటు

ఉపాధ్యాయ బదిలీల్లో రాజకీయం సిగ్గుచేటు

మహిళలు ఉద్యమం చేస్తే మానవత్వం ఉన్న ఎవరైనా స్పందిస్తారని, కానీ సీఎం జగన్ ఇప్పటివరకు స్పందించిన దాఖలాలు లేవని అసహనం వ్యక్తం చేశారు. జగన్ చేతగాని తనం వల్ల ఎనిమిది వందల మంది రైతులు చనిపోయారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఉపాధ్యాయ బదిలీల్లో రాజకీయం సిగ్గుచేటని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. వెబ్ కౌన్సిలింగ్ పేరుతో బదిలీ వ్యవస్థను నిర్వీర్యం చేశారని , సీనియారిటీని కాదని తన అనుచరుల కోసం నీచమైన ఎత్తుగడను తీసుకువచ్చారని ఆయన మండిపడ్డారు.

16 న టీడీపీ అసెంబ్లీ ముట్టడికి పిలుపు

16 న టీడీపీ అసెంబ్లీ ముట్టడికి పిలుపు

ఉపాధ్యాయులు రోడ్డెక్కి ఎలా చేశారని నిరసన తెలిపిన ఉపాధ్యాయుల పై కేసులు పెట్టి అరెస్టు చేయించడం సిగ్గుచేటని మండిపడ్డారు అచ్చెన్నాయుడు. ఈ నెల 16 న అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చామని పేర్కొన్నారు. 5 డీఆర్సీలు , 11వ పీఆర్సి ఎంతిస్తారో , ఎప్పుడిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు . అంతేకాదు ఏకపక్షంగా స్కూల్స్ తెరిచి ప్రాణాలు తీశారని పేర్కొన్నారు . కరోనాతో చనిపోయిన ఉపాధ్యాయుల మరణాలు అన్ని ప్రభుత్వ హత్యలేనని ఆయన విమర్శించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+