పిఠాపురంపై తాజా నివేదిక..మారిపోయిన సీన్..ఆ పార్టీదే లీడ్

ఏపీలో ఎన్నికల సందడి నెలకొంది. మరో రెండు వారాల్లో ఎన్నికలు జరగనుండటంతో రాజకీయ పార్టీలన్నీ కూడా గెలుపుపై ప్రత్యేక దృష్టిని సారించాయి. మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అధినేత పావులు కదుపుతున్నారు. మరోవైపు ఈసారి జగన్‌ను ఓడించి అధికారం చేజిక్కించుకోవాలని ప్రతిపక్షాలు వ్యూహాలు పన్నుతున్నాయి. ఇక గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్..ఈసారి పిఠాపురం నుంచి బరిలో దిగుతున్నారు. ఈసారి ఎలాగైనా గెలిచి చట్ట సభల్లో అడుగుపెట్టాలని పవన్ కల్యాణ్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆయన గెలుపు అంత సులువు కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

అధికార పార్టీ నుంచి వంగా గీత బరిలోకి దిగుతున్నారు. ఆమె ప్రస్తుతం కాకినాడ ఎంపీగా కొనసాగుతున్నారు. గతంలో ఆమె పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. స్థానికురాలు కావడం వంగా గీతకు ప్లస్ పాయింట్‌గా కనిపిస్తోంది. ఇటువైపు పవన్ కల్యాణ్ గెలుపు టీడీపీ నేత వర్మ మీద ఆధారపడి ఉంది. ఈ విషయాన్ని పవన్ సైతం ఒప్పుకోవడం ఆయన వ్యక్తిగత చరిష్మాకు మైనస్‌గా మారింది. మరోవైపు వర్మ బరిలో లేకపోవడంతో ఆ పార్టీ నేతలు, క్యాడర్ అసంతృప్తితో ఉన్నారు. ఇద్దరు కాపు కులానికి చెందిన వారు కావడంతో ఆ సామాజికవర్గం ఏ పార్టీకి అండగా నిలుస్తురో అని రాష్ట్రం మొత్తం కూడా అతృతుగా ఎదురు చూస్తోంది.

atest report on pithapuram constituency

పిఠాపురంలో మొత్తం తొంబై వేల దాకా కాపులు ఉంటే యూత్ ఓట్లు అన్నీ దాదాపుగా పవన్‌కే పడే అవకాశం కనిపిస్తోంది. ఇక పెద్ద వాళ్ల ఓట్లు మాత్రం కచ్చితంగా వంగా గీతకే అంటున్నారు. ఇలా కాపుల ఓట్లలో వయోభేదంతో పెద్ద చీలిక వస్తోంది. మిగిలిన కులాలలో ఎస్సీలు, బీసీలు మైనారిటీలలో మాత్రం అధిక శాతం ఓట్లు తమకే పడతాయని వైసీపీ లెక్కలు వేసుకుంటోంది. ఇదే సమయంలో ఈ అయిదేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ లబ్ధిదారుల ఓట్లపై అధికార పార్టీ ఆశలు పెట్టుకుంది.

నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల 32 వేల ఓట్లు ఉండగా, లక్షా ఎనభై వేలు ఓట్లు పోల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. వీటిల్లో కచ్చితంగా లక్షపైన ఓట్లు గీతకు వస్తాయని వైసీపీ బల్ల గుద్ది చెబుతోంది. దీంతో పిఠాపురంలో వైసీపీ గెలుపు గురించి కాకుండా మెజార్టీపై గురి పెట్టింది. దీనిలో భాగంగానే పార్టీ కీలక నేత ముద్రగడ పద్మనాభం పవన్ గెలవరని... గెలిస్తే నా పేరు మార్చుకుంటానని సవాల్ విసిరారు. పైకి జనసేన కనిపిస్తున్నప్పటికి గ్రౌండ్ లేవల్ మాత్రం దానికి విరుద్దంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఎటు చూసిన కూడా గెలుపుపై అధికార వైసీపీ ధీమాగానే కనిపిస్తోంది. ప్రస్తుతానికి అయితే పిఠాపురంలో వైసీపీకే కాస్తా ఎడ్జ్ కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+