భార్య హత్యకేసులో వ్యక్తి అరెస్ట్: ఎటిఎం దాడి నిందితుడే!
అనంతపురం/బెంగళూరు: అనంతపురం జిల్లా నల్ల చెరువులో 2008లో జరిగిన హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన వారిలో ఒకరు కర్నాటక రాజధాని బెంగళూరు ఎటిఎం దాడి కేసు నిందితుడు ఉన్నట్లుగా తెలుస్తోంది. అతని నారాయణ రెడ్డిగా గుర్తించినట్లు సమాచారం.
నిందితుడిది అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం చెరువులవాండ్లపల్లిగా తెలుస్తోంది. 2008లో స్థానికంగా జరిగిన భార్య హత్య కేసులో ఇతడు నిందితుడు. అప్పటి నుంచి ఆ వ్యక్తి పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. గతంలో ఇతడు బోర్ల లారీలు, లారీల్లో క్లీనర్‌గా పని చేసినట్లు తెలుస్తోంది. అప్పటినుంచి అతను అజ్ఞాతంలో ఉన్నాడు. ఈ కేసును సవాలుగా స్వీకరించిన పోలీసులు పాత నేరస్థుల వివరాల ఆధారంగా నిందితుడిని గుర్తించినట్లు తెలుస్తోంది.

తొలుత అనంతపురం జిల్లా ధర్మవరంలో మహిళను హతమార్చిన నిందితుడు అనంతరం బెంగళూరు ఎటియంలో ఓ మహిళపై హత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు ఘటనల అనంతరం కదిరి పరిసర ప్రాంతాల్లో నిందితుడి ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. దీంతోపాటు చెరువులవాండ్లపల్లిలో జరిగిన పీర్ల పండుగకు ఆ వ్యక్తి వచ్చినట్లు, అనంతరం అక్కడ నుంచి గాండ్లపెంట మండలం బనానచెరువుపల్లిలో ఒక రాత్రి నిద్ర కూడా చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
కాగా, ఎటిఎం నిందితుడిపై అనంత జిల్లా పోలీసుయంత్రాంగం రూ. 2లక్షల రివార్డు ప్రకటించగా, బెంగళూరు పోలీసులు రూ.లక్ష రివార్డు ప్రకటించారు.












Click it and Unblock the Notifications