నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Atmakur Bypoll Results 2022: ఆత్మకూరు..మేకపాటిదే: మెజారిటీ ఇదే

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంకు శుక్రవారం ఉపఎన్నికలు జరిగాయి. మొత్తం మూడు లోక్‌సభ స్థానాలకు ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్మకూరుకు ఉపఎన్నిక జరిగింది. దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి హఠాన్మరణంతో ఆత్మకూరు నియోజకవర్గంకు ఉపఎన్నిక జరిగింది. ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగగా... బీజేపీ తమ అభ్యర్థిని పోటీలో ఉంచింది.

Atmakur Bypoll Results 2022 Live Updates In Telugu: Will YSRCP Candidate Mekapatti Vikram Reddy Win?

ఇక ఆత్మకూరు ఉపఎన్నిక ఫలితాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నిక ఫలితాలు కూడా ఆదివారం వెలువడతాయి. దీనికి సంబంధించి లైవ్ అప్‌డేట్స్ మీకోసం..

Newest First Oldest First
3:46 PM, 26 Jun
పంజాబ్

ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు కంచుకోట ఈ సంగ్రూర్ లోక్‌సభ నియోజకవర్గం. ఇక్కడి నుంచి ఆయన రెండుసార్లు గెలుపొందారు. ఇప్పుడు అదే స్థానంపై శిరోమణి అకాలీదళ్ జెండా ఎగురవేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
3:21 PM, 26 Jun
పంజాబ్

సంగ్రూర్ లోక్‌సభ స్థానాన్ని కోల్పోయిన అధికార ఆమ్ ఆద్మీ పార్టీ. ఇక్కడ శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి సిమర్‌జిత్ సింగ్ మాన్ విజయం సాధించారు. 6,070 ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థి, ఆప్ అభ్యర్థి గుర్మెయిల్‌ సింగ్‌ను ఓడించారు.
3:09 PM, 26 Jun
ఢిల్లీ

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కలిసిన దుర్గేష్ పాఠక్. రాజీందర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి నిర్వహించిన ఉప ఎన్నికలో దుర్గేష్ పాఠక్ ఘన విజయం సాధించారు.
3:06 PM, 26 Jun
ఉత్తర్ ప్రదేశ్

ఈ విజయాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలకు అంకితం ఇస్తున్నట్లు పేర్కొన్న ఘన్‌శ్యామ్ సింగ్ లోధి. రామ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆయన ఘన విజయం సాధించారు.
2:40 PM, 26 Jun
ఢిల్లీ

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసానికి ఈ ఉప ఎన్నిక అద్దం పట్టింది. బీజేపీకి ఎలాంటి అజెండా లేదు. ప్రభుత్వాన్ని అస్థిరపర్చడమే బీజేపీ ధ్యేయం: రాజీందర్ నగర్ ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్
2:36 PM, 26 Jun
ఉత్తర్ ప్రదేశ్

రామ్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి ఘన్‌శ్యామ్ సింగ్ లోధీకి 3,67,104 ఓట్లు పోల్ అయ్యాయి. సమాజ్‌వాది పార్టీ తరఫున పోటీ చేసిన అసీమ్ రాజాకు 3,25,056 ఓట్లు పడ్డాయి. 42,048 ఓట్ల తేడాతో లోధీ గెలిచారు.
2:34 PM, 26 Jun
ఉత్తర్ ప్రదేశ్

రామ్‌పూర్ లోక్‌సభ స్థానంలో ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఘన్‌శ్యామ్ సింగ్ లోధి
1:43 PM, 26 Jun
ఉత్తర్ ప్రదేశ్

ఆజంగఢ్ లోక్‌సభ ఉప ఎన్నికలో ముందంజలో ఉన్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దినేష్ లాల్ యాదవ్ నిర్హువా. సమీప ప్రత్యర్థి, సమాజ్‌వాది పార్టీ అభ్యర్థిపై 1,935 ఓట్ల తేడాతో ఆధిక్యతలో ఉన్నారు.
1:40 PM, 26 Jun
ఢిల్లీ

రాజీందర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి దుర్గేష్ పాఠక్
1:32 PM, 26 Jun
ఉత్తర్ ప్రదేశ్

రామ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గంలో మారుతున్న ఆధిక్యత. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఘన్‌శ్యామ్ సింగ్ లోధీ లీడింగ్‌లోకి వచ్చారు. సమాజ్‌వాది పార్టీ అభ్యర్థి అసీమ్ రాజాపై 19,552 ఓట్ల ఆధిక్యతను సాధించారు.
1:17 PM, 26 Jun
పంజాబ్

సంగ్రూర్‌లో లోక్‌సభ స్థానంలో కొనసాగుతున్న శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి సిమ్రన్‌జిత్ మాన్ ఆధిక్యత. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి గుర్మెయిల్ సింగ్‌పై 5,628 ఓట్ల తేడాతో లీడింగ్‌లో ఉన్నారు.
12:25 PM, 26 Jun
త్రిపురా

జుబరాజ్ నగర్ అసెంబ్లీ స్థానంలో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మలీన దేబ్‌నాథ్. సీపీఎంకు చెందిన శైలేంద్రచంద్ర నాథ్‌ను 4,572 ఓట్ల తేడాతో ఓడించారు.
12:22 PM, 26 Jun
త్రిపురా

అగర్తలా అసెంబ్లీ నియోజకవర్గంలో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి సుదీప్ రాయ్ బర్మన్. తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అశోక్ సిన్హాను 3,163 ఓట్ల తేడాతో ఓడించారు.
12:12 PM, 26 Jun
ఆంధ్రప్రదేశ్

ఆత్మకూరులో విజయం సాధించడంపై స్పందించిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి‌పై ఉన్న అభిమానం వల్లే ఘన విజయం దక్కిందంటూ వ్యాఖ్యానించిన విక్రమ్ రెడ్డి.
12:06 PM, 26 Jun
ఆంధ్రప్రదేశ్

ఆత్మకూరులో ఘన విజయం సాధించిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి. 82,888 ఓట్ల ఆధిక్యతతో ఆయన భారతీయ జనతా పార్టీకి చెందిన భరత్ కుమార్ యాదవ్‌ను ఓడించారు. ఇక్కడ బీజేపీకి డిపాజిట్ దక్కలేదు.
12:05 PM, 26 Jun
ఉత్తర్ ప్రదేశ్

ఆజంగఢ్‌లో ఉత్కంఠభరితంగా సాగుతున్న పోరు. అధికార భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దినేష్ లాల్ యాదవ్ నిర్హువా, ప్రతిపక్ష సమాజ్‌వాది పార్టీకి చెందిన ధర్మేంద్ర యాదవ్ మధ్య రౌండ్ రౌండ్‌కూ మారుతున్న ఆధిక్యత.
11:43 AM, 26 Jun
త్రిపురా

టౌన్ బర్దోవలి నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, ముఖ్యమంత్రి మాణిక్ సాహా. 17,181 ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు.
11:40 AM, 26 Jun

ఆత్మకూరు ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో దూసుకెళ్తున్న వైఎస్ఆర్సీపి. 19 రౌండ్లు పూర్తయ్యేసరికి మేకపాటి విక్రమ్ రెడ్డికి 80,161 ఓట్లు ఆధిక్యం
11:38 AM, 26 Jun

ఆత్మకూరు ఉప ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన బీజేపీ
11:25 AM, 26 Jun

ఆత్మకూరు ఉప ఎన్నికల ఫలితాలు : వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి 76,096 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
11:13 AM, 26 Jun

ఢిల్లీ రాజేంద్రనగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి అధిక్యంలో ఉన్నారు.
11:07 AM, 26 Jun

పంజాబ్ ఉప ఎన్నికల ఫలితాలు : సంగ్రూర్ లోకసభ ఉప ఎన్నికల ఫలితాల్లో ఆప్ వెనుకంజలో ఉంది. అకాలీదళ్ స్వల్ప మెజార్టీతో దూసుకువెళ్తోంది.
11:00 AM, 26 Jun

ఆత్మకూరు ఉప ఎన్నికల ఫలితాలు: పోస్టల్ బ్యాలెట్ లో వైసీపీకి భారీ ఆధిక్యం లభించింది. 205 పోస్టల్ బ్యాలెట్లకు గానూ మేకపాటి విక్రమ్ రెడ్డికి 167 ఓట్లు వచ్చాయి.
10:56 AM, 26 Jun

ఆత్మకూరు ఉపఎన్నికల ఫలితాలలో 13 రౌండ్లు పూర్తయ్యేసరికి మేకపాటి విక్రమ్ రెడ్డి 66,650 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
10:49 AM, 26 Jun

ఆత్మకూరులో వైఎస్ఆర్సీపీ హవా కొనసాగుతుంది. 12 రౌండ్లు పూర్తయేసరికి 50,654 ఓట్ల ఆధిక్యంలో మేకపాటి విక్రమ్ రెడ్డి ఉన్నారు.
10:27 AM, 26 Jun
ఆంధ్రప్రదేశ్

ఆత్మకూరులో భారీ మెజారిటీ దిశగా దూసుకెళ్తోన్న అధికార వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి. సమీప ప్రత్యర్థి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి భరత్ కుమార్ యాదవ్‌పై 40 వేలకు పైగా ఆధిక్యత. కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన భరత్ యాదవ్
10:24 AM, 26 Jun
త్రిపురా

టౌన్ బర్దోవలి, జుబరాజ్ నగర్, సుర్మ అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు మాణిక్ సాహా, మలీనా దేబ్‌నాథ్, స్వప్నా దాస్ (పాల్), ఆధిక్యతలో ఉన్నారు. అగర్తలాలో కాంగ్రెస్‌ అభ్యర్థి సుదీప్ రాయ్ బర్మన్ లీడింగ్‌లో కొనసాగుతున్నారు. వీరిలో మాణిక్ సాహా ముఖ్యమంత్రి.
9:56 AM, 26 Jun
ఉత్తర్ ప్రదేశ్

ఆజంగఢ్ లోక్‌సభ స్థానంలో లీడింగ్‌లో ఉన్న అధికార భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, భోజ్‌పురి గాయకుడు దినేష్ లాల్ యాదవ్ నిర్హువా. రామ్‌పూర్‌లో ఆధిక్యతలో కొనసాగుతున్న సమాజ్‌వాది పార్టీ అభ్యర్థి అసీమ్ రాజా.
9:53 AM, 26 Jun
పంజాబ్

సంగ్రూర్ లోక్‌సభ స్థానంలో వెనుకంజలో ఉన్న అధికార ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి గుర్మెయిల్ సింగ్. శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి సిమ్రన్ జిత్ సింగ్ మాన్ ఇక్కడ ఆధిక్యతలో ఉన్నారు.
9:32 AM, 26 Jun
ఆంధ్రప్రదేశ్

ఆత్మకూరు ఉప ఎన్నికలో రౌండ్ రౌండ్‌కూ పెరుగుతున్న అధికార వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధిక్యత. మూడో రౌండ్ ముగిసే సమయానికి 10 వేలకు పైగా ఓట్ల ఆధిక్యత.
READ MORE

English summary
Atmakur bypoll results 2022.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X