Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పబ్లిక్ మూడ్ క్లియర్, ఏపీలో ఆ పార్టీదే అధికారం - ఏ జిల్లాలో ఎవరికెన్ని..!!

ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. గెలుపు పైన ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. ప్రచారం హోరెత్తిస్తున్నాయి. ఈ సమయంలోనే పబ్లిక్ పల్స్ తెలుసుకునేందుకు సర్వే సంస్థలు రంగంలోకి దిగాయి. ప్రముఖ సర్వే సంస్థ ఏపీలో అధికారం ఎవరిదో తేల్చేసింది. జిల్లాల వారీగా అంచనాలను వెల్లడించింది.

సర్వే అంచనాలు
ఏపీలో మే 13న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. టిడిపి, జనసేన, బిజెపి కూటమిగా పోటీ చేస్తున్నాయి. వైసిపి ఒంటరిగానే బరిలోకి దిగింది. ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే అంశం రాజకీయంగా ఉత్కంఠ పెంచుతుంది. ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ ఏపీలో ఎన్నికల ఫలితాలపై తమ అంచనాలను వెల్లడించింది. ‌. సర్వే అంచనాల మేరకు వైసిపి 48.5% ఓట్ షేర్ తో అధికారం దక్కించుకుంటుందని అంచనా వేసింది. కూటమి 46.5%, ఇతరులు మూడు శాతం. రెండు శాతం మంది ఎవరికి ఓటు వేస్తారు ఇంకా నిర్ణయానికి రాలేదని వెల్లడించింది. జిల్లాల వారీగాను ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయనేది సర్వే సంస్థ వివరించింది.

Atmasakhi group reveals the AP election predictions as mood of the state see details

ఎవరికెన్ని స్థానాలు
శ్రీకాకుళంలో వైసిపి 5 కూటమికి రెండు, మరో మూడు స్థానాల్లో పోటాపోటీ ఉన్నట్లు వెల్లడించింది. విజయనగరం జిల్లాలో వైసీపీ ఆరు కోటమి 2 ఒక స్థానంలో హోరాహోరీ ఉంటుందని పేర్కొంది. విశాఖలో వైసిపి ఆరు కూటమి ఐదు నాలుగు స్థానాల్లో గట్టి పోటీ ఉంటుంది. తూర్పుగోదావరిలో వైసిపి ఎనిమిది ,కూటమి ఏడు నాలుగు స్థానాల్లో హోరాహోరీ ఉండనుంది. పశ్చిమగోదావరిలో వైసీపీ 7 కూటమి నాలుగు మరో నాలుగు స్థానాల్లో గట్టి పోటీ ఉంటుంది. కృష్ణాజిల్లాలో వైసిపి ఎనిమిది, కూటమి ఐదు మూడు స్థానాల్లో హోరా హోరీ పోరు ఉండనుంది. గుంటూరు జిల్లాలో వైసిపి ఎనిమిది, కూటమి ఆరు పోరా హోరి మూడు స్థానాల్లో ఉంటుందని అంచనా వేసింది. ప్రకాశంలో వైసిపి ఆరు, కూటమి ఐదు ఒక స్థానంలో గట్టి పోటీ ఉంటుందని పేర్కొంది.

Atmasakhi group reveals the AP election predictions as mood of the state see details

హోరా హోరీ
నెల్లూరు జిల్లాలో వైసిపి నాలుగు, కూటమి మూడు హోరా హోరీ మూడు స్థానాల్లో ఉండనుంది. కడపలో వైసిపి ఎనిమిది. కూటమి ఒకటి మరో స్థానంలో గట్టి పోటీ ఉంటుంది. కర్నూల్ లో వైసిపి 10, కూటమి మూడు మరో స్థానంలో హోరాహోరీ. అనంతపురంలో వైసీపీ ఏడు, కూటమి నాలుగు మరో మూడు స్థానాల్లో గట్టి పోటీ ఉంటుంది. చిత్తూరు జిల్లాలో వైసిపి 10 సీట్లు గెలుస్తుందని మూడు కూటమి గెలుస్తుందని చెప్పిన సంస్థ ఒక స్థానంలో హోరాహోరీ ఉంటుందని విశ్లేషించింది. ఈ లెక్క మేరకు కూటమి 50 స్థానాల్లో, వైసిపి 93 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నట్లు విశ్లేషించింది. ఇదే సమయంలో 32 స్థానాల్లో పోరా హోరి ఉంటుందని అంచనా వేసిన సర్వే సంస్థ అందులో 19 స్థానాల్లో టిడిపి కూటమి, 13 స్థానాల్లో వైసీపీ ఆదిక్యత లో ఉందని విశ్లేషించింది. ఇక ఎంపీ స్థానాల్లో కూటమి ఐదు, వైసిపి 15 స్థానాల్లో ఆధిక్యతలో ఉండగా ఐదు స్థానాల్లో హోరాహోరీ ఉంటుందని అంచనా వేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+