వాలంటైన్స్ డే నాడు దారుణం.. యువతిపై యాసిడ్ తో దాడి
ప్రేమికుల దినోత్సవం రోజునే ఏపీలో దారుణం జరిగింది. ప్రేమను అంగీకరించలేదంటూ ఓ యువతిపై కత్తితో దాడి చేయడమే కాకుండా యాసిడ్ కూడా పోయడం సంచలనంగా మారింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకోగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం సృష్టిస్తోంది. ఈ విషాద సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే....
అన్నమయ్య జిల్లాలోని గుర్రంకొండ మండలం ప్యారంపల్లిలో జనార్దన్, రెడ్డెమ్మ దంపతులు నివసిస్తున్నారు. వారి కుమార్తె గౌతమి మదనపల్లెలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. ప్రస్తుతం పట్టణంలోని కదిరి రోడ్డులో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. ఇక ఫిబ్రవరి 7వ తేదీన గౌతమికి పెళ్లి నిశ్చయం అయింది. ఏప్రిల్ 29న పీలేరుకు చెందిన శ్రీకాంత్ తో పెళ్లి నిశ్చయించారు. అయితే మదనపల్లె అమ్మచెరువు మిట్టకు చెందిన గణేష్.. గౌతమిని ప్రేమించమంటూ గత కొంత కాలంగా వేధిస్తున్నాడు.

ఈ క్రమంలోనే ఈరోజు గౌతమి తల్లితండ్రులు పాలు పిండటానికి వెళ్లడం గమనించి అక్కడికి వెళ్లి ఆమె తలపై కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత యాసిడ్ తో కూడా దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన గౌతమిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యువతి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇక యాసిడ్ బాధితురాలు తండ్రి జనార్ధన్ కు మంత్రి నారా లోకేశ్ ఫోన్ చేశారు. యాసిడ్ దాడి ఘటన తనను తీవ్ర ఆందోళనకు గురి చేసిందని వ్యాఖ్యానించారు. ఆమెను తన సొంత చెల్లిగా భావించి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. చెల్లి కోలుకోవడానికి అత్యంత మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. దాడిచేసిన ఉన్మాదిని కఠినంగా శిక్షిస్తామని.. అలాంటి సైకోలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని లోకేశ్ పేర్కొన్నారు.
మరోవైపు ఈ ఘటనపై హోం మంత్రి అనిత సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీతో మాట్లాడిన మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబసభ్యులతోనూ యువతి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం అవసరమైతే బెంగళూరుకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. నిందితుడిని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించవద్దని పోలీసులను ఆదేశించారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications