రోజా పైన అట్రాసిటీ కేసు, బాబుతో రాజధాని కమిటీ భేటీ
చిత్తూరు/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నగరి శాసన సభ్యురాలు రోజా పైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. నగరి జాతరలో కులం పేరుతో దోషించారని రోజాపై ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్యే రోజా, మున్సిపల్ చైర్మన్ కేజే శాంతి సహా 13 మందిపై టీడీపీ కార్యకర్త రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చంద్రబాబుతో రాజధాని సలహా కమిటీ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాజధాని సలహా కమిటీ సభ్యులు గురువారం సమావేశమయ్యారు. నూతన రాజధాని నిర్మాణంలో భాగంగా వివిధ రాష్ర్టాలను సందర్శించిన కమిటీ సభ్యులు పర్యటన వివరాలను సీఎం చంద్రబాబుకు వివరించారు. త్వరలో విదేశాల్లో రాజధాని సలహా కమిటీ పర్యటించనుంది.
చర్లపల్లి జైలులో తనిఖీలు
చర్లపల్లి కేంద్ర కారాగారంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో వారు ఖైదీల నుండి ఆరు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
మార్నింగ్ వాక్ చేస్తూ పడిపోయిన అధికారి
హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో మార్నింగ్ వాక్ చేస్తూ ఐపీఎస్ అధికారి సురేందర్ లాంబా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వాక్ చేస్తున్న ఆయనకు గుండెపోటు రావడంతో ఉక్కిరిబిక్కిరై కుప్పకూలారు. వెంటనే ఆయన భద్రతా సిబ్బంది సురేందర్ ను యశోదా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications