కడప జిల్లాలో దారుణం.. 6వ తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన కీచక టీచర్
మాత, పిత, గురు, దైవం అంటూ ఉంటారు. తల్లిదండ్రుల తర్వాత అంతటి గొప్ప స్థానాన్ని గురువులకు మాత్రమే ఇస్తూ ఉంటాం. అలాంటిది చదువులు చెప్పే టీచర్లే కామకోరికలతో నీతిమానుల పనులు చేస్తే ఇంక ఆ బాధ వర్ణనాతీతం. టీచర్లు విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న ఘటనలను ఇటీవలే చూస్తూనే ఉంటున్నాం. ఇప్పుడు ఈ తరహా ఘటనే మరొకటి చోటు చేసుకుంది.
కడప జిల్లా బద్వేల్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ఏవీఆర్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల కంప్యూటర్ టీచర్ పెంచలయ్య అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపనలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సదరు విద్యార్ధిని తల్లిదండ్రులతో తన బాధను వ్యక్తం చేసింది.

దీంతో విద్యార్ధిని తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ వద్దకు చేరుకొని కీచక టీచర్ కు దేహశుద్ది చేశారు. స్కూల్ ఆవరణ లోనే కంప్యూటర్ టీచర్ ను చితకబాదారు. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఉపాధ్యాయుడుని స్టేషన్‌కు తరలించి, విచారణ చేపడుతున్నారు.
మరోవైపు ఇటీవలే లిటిల్ ప్లవర్ పాఠశాలలో ఉపాధ్యాయుడు అన్వర్‌బాషా కొంత కాలంగా నాల్గవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు విషయం తెలియజేసింది. తనను తరగతి గదిలోకి తీసుకెళ్లి ప్రయివేట్ పార్ట్స్‌పై చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడని విద్యార్థిని వాపోయింది. ఈ మేరకు విద్యార్థిని తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడిని చితకబాదారు. దీంతో పాఠశాలలో సహచర ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఉపాధ్యాయుడిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్టు తెలిపారు.












Click it and Unblock the Notifications