హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహేష్ కత్తిపై దాడి: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ రిప్లై ఇదీ...

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: తనపై దాడికి సంబంధించిన సినీ క్రిటిక్ మహేష్ కత్తి చేసిన ఆరోపణలపై జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు స్పందించారు. హైదరాబాదులోని కొండాపూర్‌లో తనపై పవన్ కల్యాణ్ అభిమానులు దాడి చేశారని మహేష్ కత్తి ఆరోపించిన విషయం తెలిసిందే.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్: మహేష్ కత్తి ఫ్యామిలీ నేపథ్యం ఇదీ...ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్: మహేష్ కత్తి ఫ్యామిలీ నేపథ్యం ఇదీ...

మహేష్ కత్తిపై దాడి చేసింది పవన్ కల్యాణ్ అభిమానులు కారని ఆయన ఫ్యాన్స్ స్పష్టం చేశారు. శుక్రవారం విజయవాడలో పవన్ కల్యాణ్ అభిమానులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు.

Recommended Video

Mahesh Kathi vs Pawan Kalyan పవన్ కళ్యాణ్ vs మహేష్ కత్తి : అదీ సంగతి ?
మహేష్ కత్తి వ్యాఖ్యలు దారుణం

మహేష్ కత్తి వ్యాఖ్యలు దారుణం

పవన్ కల్యాణ్ తీవ్రవాదులను తయారు చేస్తన్నారని మహేష్ కత్తి వ్యాఖ్యానించడం దారుణమని వారన్నారు. త్వరలోనే మహేష్ కత్తి సిగ్గుతో తల వంచుకునే పరిస్థితి వస్తుందని వారు అభిప్రాయపడ్డారు.

 మీ లాంటి వాళ్లపై స్పందించరు..

మీ లాంటి వాళ్లపై స్పందించరు..

మహేష్ కత్తి వంటివాళ్లపై పవన్ కల్యాణ్ స్పందించబోరని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అన్నారు. అర్థంలేని విమర్శలు చేస్తుంటేసమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు.

 మహేష్ కత్తిపై ప్రభావం ఎవ్పుడైనా...

మహేష్ కత్తిపై ప్రభావం ఎవ్పుడైనా...

పవన్ కల్యాణ్ అభిమానులను తీవ్రవాదులుగా చిత్రీకరిస్తూ చేసిన వ్యాఖ్యల ప్రభావం మహేష్ కత్తిపై ఎప్పుడైనా పడుతుందని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అన్నారు. మహేష్ కత్తి వెనక ఉండి ఎవరు మాట్లాడిస్తున్నారో జాగ్రత్తగా గమనించాలని వారు పవన్ కల్యాణ్ అభిమానులకు సూచించార.

ఏదో రాజకీయ కుట్ర..

ఏదో రాజకీయ కుట్ర..

ఏదో రాజకీయ కుట్ర జరుగుతోందని పవన్ కల్యాణ్ అభిమానులు అభిప్రాయపడ్డారు. అందువల్ల వవన్ అభిమానులు సంయమనం పాటించాలని వారు సూచించారు. మహేష్ కత్తి వంటివాళ్లపై స్పందించవద్దని పవన్ తన అభిమానులకు పిలుపునిచచారని, దాన్ని తాము పాటిస్తున్నామని వారు చెప్పారు.

English summary
Jana Sena chief Pawan Kalyan fans denied Mahesh Kathi's allagations on attack in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X