పవన్ కల్యాణే టార్గెట్: అసలు ఎవరీ మహేష్ కత్తి?

Recommended Video

    అసలు ఎవరీ మహేష్ కత్తి?

    హైదరాబాద్: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై తెరిపి లేకుండా విమర్శలు చేస్తూ మహేష్ కత్తి వార్తల్లో వ్యక్తిగా మారారు. సినీ క్రిటిక్‌గా మాత్రమే ఆయన చాలా మందికి తెలుసు. సినిమాలను తన సమీక్షల ద్వారా కత్తి తీసుకుని నరుకుతాడని అందరూ అనుకుంటూ వస్తున్నారు.

    తాను అన్ని విషయాల గురించి మాట్లాడుతున్నానని మహేష్ కత్తి చెబుతున్నప్పటికీ ఆయన ప్రధాన లక్ష్యం పవన్ కల్యాణ్ అనేది అందరికీ అర్థమవుతున్న విషయం. పవన్ కల్యాణ్‌నే ఎందుకు లక్ష్యం చేసుకున్నాడనే విషయంపై ఎవరి అంచనాలు, ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. అయితే, కత్తి మహేష్ జీవితం ఏమిటనేది చాలా మందికి తెలియని విషయం.

     ఎవరికీ తెలియని పేరే..

    ఎవరికీ తెలియని పేరే..

    మహేష్ కత్తి చాలా కాలంగా సినీ పరిశ్రమలో ఉన్నారు. కానీ పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేయడంతో ఆయన పేరు చాలా వరకు వెలుగులోకి వచ్చింది. ప్రచారం కోసమే ఆయన పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తున్నారని చాలా మంది అనుకుంటున్నప్పటికీ పూనమ్ కౌర్‌ను కూడా లాగడంతో అది సీరియస్‌గా మారిపోయింది.

     బిగ్‌బాస్‌తో కాస్తా వెలుగులోకి...

    బిగ్‌బాస్‌తో కాస్తా వెలుగులోకి...

    జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన తెలుగు బిగ్‌బాస్ ద్వారా మహేష్ కత్తి పేరు కొంత పాపులర్ అయింది. మహేష్ కత్తి సినిమా రివ్యూల గురించి బిగ్ బాస్ కార్యక్రమంలో ఎన్టీఆర్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ కార్యక్రమంలో ఆయన చేసిన చికెన్‌కు కత్తి చికెన్ అని పేరు పెడుతున్నట్లు ఎన్టీఆర్ అన్నారు కూడా.

     ఆయన పుట్టింది ఇక్కడ..

    ఆయన పుట్టింది ఇక్కడ..

    ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో మహేష్ కత్తి జన్మించాడు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఫిల్మ్ థియరీలో స్పెషలైజేషన్ చేశాడు. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ జీవితం ఆధారంగా వచ్చిన ఎదరి వర్షం లఘు చిత్రంతో తన సినీ కెరీర్‌ను ప్రారంభించాడు.

    మిణుగురులు సినిమాకు సహ రచయిత

    మిణుగురులు సినిమాకు సహ రచయిత

    మిణుగురులు సినిమాకు మహేష్ కత్తి సహ రచయితగా వ్యవహరించాడు. 2015లో రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా పెసరట్టు సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ తర్వాత సంపూర్ణేశ్‌బాబు హృదయ కాలేయం సినిమాలో పోలీసాఫీసర్ పాత్రలో కనిపించాడు. ఎగిసే తారాజువ్వలు సినిమాకు దర్శకత్వం వహించాడు. అదేవిధంగా కొబ్బరిమట్ట సినిమాలో కూడా నటించాడు, నేనే రాజు నేనే మంత్రి సినిమాలో ఛాయ్ అమ్మే వ్యక్తి పాత్రలో కనిపించాడు.

     తాజా చిత్రం ఎగిసే తారాజువ్వలు...

    తాజా చిత్రం ఎగిసే తారాజువ్వలు...

    మహేష్ కత్తి తాజా సినిమా ఎగిసే తారాజువ్వలు. పిల్లల్లో శాస్త్రియ దృక్పథం పెంచాలనే ఉద్దేశంతో ఈ సినిమా తలపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సినిమా తీస్తానని ఆయన అంటున్నారు. తాను సైకాలజీ కూడా చదివానని చెబుకున్నారు. తనను తాను ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలిగా చెబుకుంటారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+