రేప్ యత్నమా, దాడి జరిగిందా: వైసిపి మహిళ నేత ఇంట్లో కలకలం
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలి ఇంటిలో ఓ జెడ్పీటీసీ సభ్యుడు గాయాలతో పడి ఉన్న సంఘటన గుంటూరులో కలకలం రేపుతోంది. జిల్లాలోని మణిపురం గ్రామంలోని వైసిపి నేత, జెడ్పీ ఫ్లోర్లీడర్ రేవతి ఇంట్లో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.
తన పైన అత్యాచారయత్నం జరిగిందని రేవతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వట్టిచెరుకూరు మండలం లేమర్లపాడు వాసి నారాయణ జెడ్పీటీసీ రేవతి ఇంట్లో గాయాలతో పడి ఉన్నారు. తాను డబ్బులు అడిగినందుకు తన పైన దాడి చేశారని, బాధితుడు నారాయణ చెబుతున్నారు.

పోలీసులు అతనిని ఆసుపత్రికి తరలించారు. అయితే, మహిళా నాయకురాలు చెబుతున్న అత్యాచారయత్నం నిజమా, లేక ఆయన చెబుతున్న దాడి నిజమా అని పోలీసులు విచారణలో తేలనుంది. పోలీసులు దీనిపై దర్యాఫ్తు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications